వీసీ సాంబయ్యకు మరో నెల ఊరట

22 Aug, 2016 23:36 IST|Sakshi
వీసీ సాంబయ్యకు మరో నెల ఊరట
తెయూ(డిచ్‌పల్లి) : సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సాంబయ్యకు మరో నెల ఊరట లభించినట్లయింది. గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వీసీ లను నియమించింది. ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. అదే నెల 27న హైకోర్టు వీసీ ల నియామకాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వ వినతి మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం తెలంగాణలో వీసీ ల నియామకంలో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు  తీర్పును మరో నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఒక వేళ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినట్లయితే తెయూ వీసీ సాంబయ్యతో పాటు మిగిలిన యూనివర్సిటీల వీసీ తమ పదవులను కోల్పోయేవారు. 
మరిన్ని వార్తలు