బిస్కెట్లు ఇచ్చి దోచేశారు

19 Aug, 2015 20:21 IST|Sakshi
బిస్కెట్లు ఇచ్చి దోచేశారు

విజయవాడ: మత్తు మందు చల్లిన బిస్కెట్లు ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ స్టేషన్ వద్దకు రాగానే కొంతమంది ప్రయాణికులు రైల్లోకి ఎక్కారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. తోటి ప్రయాణికులకు బిస్కెట్లు ఇచ్చారు. ఆ బిస్కెట్లు తిన్నవారంతా నిద్రలోకి జారుకున్నారు. తర్వాత ఆ దుండగులు వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు.

ఇద్దరు దంపతులు మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో దిగాల్సి ఉండగా మత్తు మందు చల్లిన బిస్కెట్లు తినడంతో నిద్రలోనుంచి లేవలేకపోయారు. విజయవాడ వచ్చినా వారు నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు