శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

1 Oct, 2016 00:35 IST|Sakshi
శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
హన్మకొండ కల్చరల్‌ : భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవాదాయశాఖ జేవీఓ, ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం నుంచి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తుల కోసం తగిన సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. దసరారోజు వాహన పూజలు కీర్తి గార్డె¯Œ్స వద్దనే ఉంటాయన్నారు. అమ్మవారి విశేష సేవలో యాజమాన్యం కోరుకునే వారు రూ. 1,116 చెల్లించి దేవస్థాన కార్యాలయంలో రశీదు పొందాలన్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తంగా వరంగల్‌లో వెలిసిందన్నారు. నవరాత్రుల్లో శతచండీయాగం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దేవీ నవరాత్రి ఉత్సవాల వాల్‌పోస్టర్లను అధికారులు, అర్చకులు ఆవిష్కరించారు. ఆలయ సూపరింటెండెంట్‌ అద్దంకి విజయ్‌కుమార్, కూచన హరినాథ్, వెంకటయ్య, అశోక్, అర్చకులు సోమసుందరశర్మ, రాము, చింత శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు