వరంగల్ సెంట్రల్ జైలుకు సనా

14 Nov, 2015 00:46 IST|Sakshi
వరంగల్ సెంట్రల్ జైలుకు సనా

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న అనిల్ రెండో భార్య సనను పోలీసులు  శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 27వరకూ రిమాండ్ విధించింది. దీంతో సనాను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా సనా రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సనాను అనిల్ 2010లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని చూసేందుకు రాజయ్య, ఆయన భార్య మాధవి వచ్చేవారని తెలుస్తోంది. అనిల్, అత్త మాధవి ప్రవర్తన వల్ల సారిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం.

 అలాగే రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులపై రాహుల్ గాంధీకి సారిక రాసిన లేఖను ...సనా దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అవినీతి ఆరోపణలపై రాజయ్య ఏసీబీకి ఇచ్చిన సంజాయిషీ డైరీని కూడా ఆమె నుంచి పోలీసులు తీసుకున్నారు. ఇక రాజయ్యకు ఎంపీ టికెట్ రావడంతో సారికను ఇంట్లో నుంచి పంపించేయాలని సనా ఒత్తిడి తెచ్చినట్లు సనా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు