సమాజ సేవలోనే సంతృప్తి

22 Feb, 2017 22:47 IST|Sakshi
సమాజ సేవలోనే సంతృప్తి
 ఆర్‌డీటీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ 
 
ఆత్మకూరురూరల్: తోటి మనిషికి సహయం చేయడంలోనే సంత​ృప్తి దాగి ఉంటుందని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ స్పష్టం చేశారు. ‘ఇండియా ఫర్‌ ఇండియా’ అన్న తమ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సేవా హుండీల  పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన బుధవారం ఆత్మకూరు వచ్చారు.ఈ సందర్భంగా రాయల్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎప్పుడూ విదేశీ నిధులతోనే సేవ చేయాలా? మనల్ని మనం ఆదుకుందామనే  ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే  సేవా హుండీలని ఆయన చెప్పారు .
 
 చాలా మంది ఈ హుండీలో  రోజుకొక రూపాయ చొప్పున  వేసి ఏడాది  తర్వాత తిరిగి తమ సంస్థ సేవాకార్యక్రమాలకు అందజేస్తున్నారన్నారు. 2014లో మొదలైన ఈ ఉద్యమంతో ఇప్పటికి కోట్లాది రూపాయలు సంస్థకు అందాయన్నారు. గత సంవత్సరం 1,44,596  సేవా హుండీల ద్వారా రూ.4,12,71,077 సమకూరిందన్నారు. ఈ డబ్బును నల్లమలలో అత్యంత దుర్భర  జీవనం గడుపుతున్న చెంచుల సంక్షేమానికి వెచ్చిస్తునా​‍్నమని చెప్పారు.  అనంతరం ఆయన ఎంపిక చేసిన వలంటీర్లకు సేవా హుండీలను అందించి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.  కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు.ఆర్‌డీటీ సిబ్బంది వన్నూరప్ప, బాషాతదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు