ఓర్వకల్లులో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి

27 Feb, 2017 22:11 IST|Sakshi
ఓర్వకల్లులో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి
– తెలుగు నిర్మాతల కౌన్సిల్‌ చైర్మన్‌ సత్యారెడ్డి
– చిన్న బడ్జెట్‌ చిత్రాలకు సబ్సిడీ ఇప్పిస్తాం..
– కర్నూలు కేంద్రంగా సినిమా నిర్మాణం జరగాలి
కర్నూలు(కల్చరల్‌):   జిల్లాలోని ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో పలు సినిమాల నిర్మాణం జరుగుతోందని  ఇక్కడ సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేస్తామని తెలుగు ప్రొడ్యూసర్స్‌ సెక్టర్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సత్యారెడ్డి తెలిపారు. స్థానిక రాఘవేంద్రనగర్‌లో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బీవీ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన కాస్మోపాలిటన్‌ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో సినీ నిర్మాణానికి అనుకూలమైన షూటింగ్‌ స్పాట్స్‌ ఉన్నాయన్నారు.  ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్న చాలా సినిమాలు సూపర్‌హిట్‌  అయ్యాయి. తెలుగు సినీ రంగ చరిత్రలోనే బ్లాక్‌ బ్లస్టర్‌గా పేరుతెచ్చుకున్న బాహుబలి చిత్రం షూటింగ్‌ కూడా కర్నూలులో ప్రారంభమైందన్నారు.  తెలుగురాష్ట్రం రెండుగా విడిపోయినా సినిమా పరిశ్రమ మాత్రం కలిసికట్టుగా పని చేస్తుందన్నారు.  
 
లో బడ్జెట్‌ చిత్రాలకు సబ్సిడీ ః
తెలుగు సినీ రంగంలో లో బడ్జెట్‌ చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే విధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తామని సత్యారెడ్డి తెలిపారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరముందన్నారు. కర్నూల్లో కాస్మోపాలిటన్‌ కల్చరల్‌ సెంటర్‌ ద్వారా చక్కని వినోదాన్ని కల్గిస్తున్న సినీనటుడు, నిర్మాత బీవీ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ   సమావేశంలో బీవీ రెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు