మహిళలకు అండగా షీ టీం

12 Dec, 2016 15:08 IST|Sakshi
మహిళలకు అండగా షీ టీం

డీఎస్పీ మల్లారెడ్డి
 ఉట్నూర్ రూరల్ : మహిళలు, విద్యార్థినులకు అండగా షీ టీంలు పని చేస్తున్నాయని డీఎస్పీ మల్లారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కుమ్రంభీం కాంప్లెక్స్ ఆవరణలో బాలికల మేనేజ్‌మెంటు హాస్టల్ విద్యార్థినులకు షీటీంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు పెరిగాయని వాటి నివారణకు ప్రభుత్వం షీ టీంలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కళాశాల, మార్కెట్, షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆకతారుులు ఆగడాలు చేస్తే 100కు సమాచారం అందించాలని తెలిపారు.

వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినులు హాస్టళ్లలో ఫోన్లు వినియోగించరాదని, ఫోన్లు వినియోగించిన వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చయ్య, వార్డెన్ ప్రమీల, బీఏడ్ కళాశాల ప్రిన్సిపాల్ మేస్రం మనోహర్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా  అధ్యక్షుడు వెడ్మ భొజ్జు, ఎస్‌సై మంగిలాల్, సిబ్బంది,  విద్యార్థినులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు