ఏం చక్కటి వయ్యారం!

2 Mar, 2016 03:56 IST|Sakshi
ఏం చక్కటి వయ్యారం!

సైబీరియన్ పక్షులతో గోపవరం మండలం బేతాయపల్లి చెరువు కళకళలాడుతోంది. ఇక్కడికి సమీపంలోనే సోమశిల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండటంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో పక్షులు వచ్చాయి. చిన్న చిన్న కట్టె పల్లలను ఏరుకొచ్చి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగి.. వాటికి రెక్కలొచ్చే వరకు ఈ పక్షులు ఇక్కడే ఉంటాయి. అనంతరం స్వస్థాలానికి పిల్లలతో కలిసి ఎగిరిపోతాయి.

 సైబీరియన్  పక్షుల సందడి
పెద్ద ముక్కు... పొడవాటి కాళ్లు.. విశాలమైన రెక్కలు.. చూసేందుకు భలేగున్నాయి కదూ.. ఇవి సైబీరియన్ పక్షులు. మన జిల్లాకు అతిథులుగా వచ్చాయి. గోపవరం మండలం బేతాయిపల్లెలోని చెట్లపై గూళ్లు కట్టుకున్నాయి. జనవరి చివరిలో వచ్చిన ఈ విహంగాలు ఇక్కడే గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి అవి కాస్త ఎగిరే దశకు చేరాక తిరిగి తమ ప్రాంతానికి రివ్వున ఎగిరిపోతాయి. సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపలను ఆరగిస్తూ.. సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి. 

 - ఫొటోలు: రమేష్

మరిన్ని వార్తలు