ప్రేమ విఫలం : సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

25 Oct, 2015 11:56 IST|Sakshi
ప్రేమ విఫలం : సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ఒంగోలు : చిన్ననాటి నుంచి వెంకటేష్  ప్రసాద్, కోమలి ఇద్దరూ కలిసే చదువుకున్నారు... అదికాస్తా స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంతలో కోమలికి బెంగుళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ ప్రసాద్ కి బెంగుళూరులోనే ఉద్యోగం వచ్చింది. ఇంకే పెళ్లి చేసుందామనుకుంటున్న తరుణంలో ఆ ప్రేమికుల మధ్య కట్నం అడ్డుగోడగా నిలిచింది. దీంతో మనస్తాపం చెందిన కోమలి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ... నా కుమారుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే భారీగా కట్నం ఇవ్వాలని ప్రేమికుడి వెంకటేష్ ప్రసాద్ తల్లిదండ్రులు... కోమలి తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది.

ఆ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో కోమలి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దసరా పండగ నేపథ్యంలో కోమలి స్వగ్రామం బొడ్డువానిపాలెం వచ్చి... ఇలా విగత జీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మరిన్ని వార్తలు