హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి

24 Aug, 2016 23:47 IST|Sakshi
కలెక్టరేట్‌ ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు
వీరన్నపేట(మహబూబ్‌నగర్‌) : హాస్టళ్ల సమస్య లు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటం చేస్తామని పీడీఎస్‌యూ రాష్ట సహాయ కార్యదర్శి రాము స్పష్టం చేశారు. స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల ని డిమాండ్‌ చేస్తూ బుధవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యం లో విద్యార్థులు  కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ర్యాలీ గా బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలి కల, బాలుర జూనియర్‌ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తో పులాట చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థులకు అ డుగడుగునా అడ్డుతగలడమే కాకుండా కలెక్టరేట్‌ వైపు విద్యార్థులు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ముందు విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అనుమతి లేదంటూ వాదించారు. దీంతో పీడీఎస్‌యూ నాయకులు పోలీసు ల తీరును నిరసిస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో విద్యారంగ అభివద్ధికి పెద్దపీట వేస్తానని చెప్పి కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని ఆ రోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్‌ఎంహెచ్‌ విద్యార్థులకు నెలకు మెస్‌ చార్జీలు రూ. 1050 మాత్రమే చెల్లిస్తుందని, ప్రతి విద్యార్థికి రూ. 2500 చె ల్లించాలని డిమాండ్‌ చేశారు. దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రతి హాస్టల్‌లో ఇద్దరు ఏఎన్‌ఎంలతో పాటు వాచ్‌మెన్‌లను నియమించాలని  డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాల లు, కళాశాలల పట్ల ప్రభుత్వం వివక్షత చూపిస్తే ముఖ్యమంత్రి ఇంటిని సైతం ముట్టడించేందుకు తాము వెనుకాడబోమని హెచ్చరించారు.  పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వెంకట్, నాయకులు రామకష్ణ, పురుషోత్తం, భాస్కర్, అనిల్, అంజి, వెంకటేష్‌. సాయి, ప్రకాష్, ప్రవీణ్, కార్తీక్, చెన్నకేశవులు   పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు