రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం

22 Aug, 2016 22:05 IST|Sakshi
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అహ్మద్‌నదీమ్‌
  • సిద్దిపేట జోన్‌: రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ భూసేకరణ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా శాఖపరమైన సంస్కరణలను తాత్కాలికంగా చేపట్టినట్లు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ అహ్మద్‌ నదీమ్‌ అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రిజర్వాయర్‌ల కోసం 25 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. సంబందిత సేకరణ భూముల రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు

    అందులో బాగంగా తాత్కలికంగా సేకరణ  భూముల రిజిస్ట్రేషన్‌ల కోసం 5 కేంద్రానలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కోన్నారు. కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి, తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌, పల్లెపహడ్‌, సిద్దిపేట మండలం ఇమాంబాద్‌లో   సెప్టెంబర్‌ 1 నుంచి తాత్కలిక రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు పనిచేస్తాయన్నారు.
     

మరిన్ని వార్తలు