అశోక్తో సొంతబేనర్‌లో సినిమా: సుకుమార్

1 Jun, 2016 08:27 IST|Sakshi
అశోక్తో సొంతబేనర్‌లో సినిమా: సుకుమార్

సినీ దర్శకుడు సుకుమార్
 
మలికిపురం :  త్వరలో తన తండ్రి బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరున ఉన్న బీటీఆర్ క్రియేషన్‌‌సపై తన అన్నయ్య తనయుడు అశోక్ హీరోగా  సినిమా తీస్తున్నట్టు ప్రముఖ సినీ దర్శకుడు బి.సుకుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్వగ్రామం మట్టపర్రు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.

జూన్ 9వతేదీ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రానికి ‘దర్శకుడు’ అనే టైటిల్ పెట్టినట్టు సుకుమార్ చెప్పారు. దీనికి ట్యాగ్ లైన్‌గా ‘ఫర్ లవ్ హిజ్ ఫ్యాషన్’ ఉంటుందన్నారు.  ‘అంతకు ముందు ఆ తర్వాత..’ సినిమాలోని హీరోయిన్ ఈష ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుందన్నారు. హరి ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. ఇక తన దర్శకత్వంలో రూపొందించే చిత్రానికి స్క్రిప్ట్ రూపొందించుకుంటున్నట్టు సుకుమార్ చెప్పారు.

మరిన్ని వార్తలు