కార్మిక చట్టాలు అమల్లో కేసీఆర్‌ విఫలం

27 Dec, 2016 02:53 IST|Sakshi
కార్మిక చట్టాలు అమల్లో కేసీఆర్‌ విఫలం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

చొప్పదండి: కార్మిక చట్టాలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని, అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెంది తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలకే సీఎం కేసీఆర్‌ వత్తాసు పలుకుతున్నాడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 93 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను విస్మరిస్తున్నారన్నారు. కరీంనగర్‌ జిల్లాలో సీపీఎం పాదయాత్ర సోమవారం చొప్పదండి, ఆర్నకొండ గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్నకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక చట్టాలను అమలు చేయడం లేదన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎస్‌వీ రమణ పాల్గొన్నారు.

లెదర్‌ పార్క్‌ను ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి సమీపంలోని రుక్మాపూర్‌లో ప్రతి పాదించిన లెదర్‌పార్క్‌ పనులను వెంటనే ప్రారంభించాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు