విద్యార్థినికి ప్రేమలేఖలు

26 Jan, 2016 07:50 IST|Sakshi
విద్యార్థినికి ప్రేమలేఖలు

ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగింపు

ఈఓ మోత్కూరు(నల్గొండ జిల్లా): విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా ఆర్డ్స్ అండ్ క్రాఫ్స్ టీచర్‌గా పనిచేస్తున్న గూడెపు పరమేశ్ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తనను ప్రేమించాలంటూ ప్రేమ లేఖలు రాశాడు.

గతంలో ప్రేమ లేఖలు రాసిన సందర్భంలో పరమేశ్‌ను ప్రధానోపాధ్యాయుడు మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పులేదు. గత 15 రోజుల్లో రెండుసార్లు విద్యార్థినికి ప్రేమలేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశాడు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ విచారణ జరిపారు. అనంతరం ప్రేమ లేఖలు రాసిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంఈఓ అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి తెలిపారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు.

మరిన్ని వార్తలు