లోటస్‌పాండ్‌లో టీచర్స్ డే వేడుకలు

6 Sep, 2016 23:23 IST|Sakshi
లోటస్‌పాండ్‌లో టీచర్స్ డే వేడుకలు

సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్‌ సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ గొ ప్ప పండితుడు, తత్వవేత్త అని వైఎస్సార్‌ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. ఉపాధ్యా య లోకానికి ఆయన ఒక దిక్సూచి అన్నా రు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమవారం ఉపాధ్యా య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో విశిష్ట సేవలందించిన వివిధ జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఉపాధ్యాయ వృత్తికి నిలువెత్తు అద్దం రాధాక్రిష్ణన్‌ అని చెప్పారు. ఒక వైపు వినాయక చవితి పర్వదినం, మరో వైపు సర్వేపల్లి పుట్టినరోజు రావటం శుభసూచకమన్నారు. తొలుత సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి,

తెలంగా ణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్‌ సీపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాప్‌ రెడ్డి, చల్లా మధుసూదన్‌ రెడ్డి, బి.మోహన్‌ కుమార్, కొల్లి నిర్మల కుమారి, అరుణ్‌ కుమార్, భువనం భూషన్, సునీల్‌ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, బుర్ర సురేష్‌ గౌడ్, సిద్ధారెడ్డి, బెంబడి శ్రీనివాస రెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్కారం అందుకున్న ఉపాధ్యాయుల వీరే...
ఈదర్‌ ఆంథోని రెడ్డి(సెంట్‌ ఆంథోని హైస్కూల్, విద్యానగర్, సంగారెడ్డి), షేక్‌ మస్తాన్‌ వలి(ఎస్‌జీటీ, వెంకటేశ్వరనగర్, బాలానగర్‌), బోనాల శ్రీనివాస్‌(జెడ్‌పీహెచ్‌ఎస్, సనత్‌నగర్‌), జి.రఘునాథ్‌ రెడ్డి(బాగ్‌అమీర్‌ ప్రాథమిక పాఠశాల, బాలనగర్‌), ఏర్రాడి రామేశ్వరరావు(హెచ్‌ ఎం, జెడ్‌పీహెచ్‌ఎస్, జగద్గిరిగుట్ట), కారు పోతుల వెంకటయ్య (హెచ్‌ఎం, సీ బీ రాజునగర్‌ ప్రాథమిక పాఠశాల, బాల నగర్‌), యాదయ్య (హెచ్‌ఎం, హఫీజ్‌పేట్‌), ఎ.ఎం.ప్రసన్న లక్ష్మి, ఎస్‌జీటీ, ప్రాథమికపాఠశాల, వెంకటేశ్వనగర్, రం గారెడ్డి), శ్రీనివాస్‌(హెచ్‌ఎం, జెడ్‌పీహెచ్‌ ఎస్, సంగారెడ్డి)లను పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయ సాయిరెడ్డిలు శాలువతో సత్కరించి, వినాయక ప్రతిమ ఉన్న జ్ఞాపిక అందజేశారు.

కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు...
వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఘనంగా పూజలు ని ర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రామచంద్రశాస్త్రి పూజ అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు.

మరిన్ని వార్తలు