కాళ్లు చేతులు కట్టి..మెడకు తాడు బిగించి..

1 May, 2016 18:56 IST|Sakshi

లారీ డ్రైవర్ దారుణ హత్య
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా)

గుర్తు తెలియని దుండగుల చేతుల్లో లారి డ్రైవర్ దారుణహత్యకు గురైయ్యాడు. హత్యకుగురైన వ్యక్తి వ్యవసాయక్షేత్రం వద్దనే కాళ్ళుచేతులు కట్టివేసి మెడకు తాడు బిగించి, చెట్టుకు ఊరివేసినట్లుగా మృతదేహన్ని వదలివెళ్లారు. గ్రామ సమీపంలోనే ఈ బావి వుండటంతో ఆదివారం ఉదయం వ్యవసాయక్షేత్రలకు వెళుతున్న రైతులు చూసి సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

 స్థానిక సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం వివరాలు.... పోచారం గ్రామానికి చెందిన కాసుల యాదయ్య(50) లారి డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని తెలిపారు. శనివారం ఇంట్లో నుంచి యాదయ్య వెళ్లాడు. అతను ఎక్కడికి వెళ్లిందో తెలియదని అయితే యాదయ్య కాళ్ళు చేతులు తాళ్లతో కట్టిపడవేసి, మెడకు తాడుతో గట్టిగా భిగించి హత్యచేసి,అతని వ్యవసాయబావి వద్దనే గల సర్కార్ ముళ్ల చెట్టుకు తాడుతోకట్టి మృతదేహన్ని వదలివెళ్లినట్లు తెలిపారు. మృతుని గొంతును బ్లేడ్‌తో కోసిన గాయాలున్నాట్లు తెలిపారు.

సంఘటన స్థలంలో ఒక చెప్పు, క్రిమిసంహారక మందు బాటిల్, గ్లాసు లభించగా మరో చెప్పు గ్రామంలో దొరికినట్లు చెప్పారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించారు. జగిలాలు మృతదేహం చుట్టు తిరిగి ఉప్పరిగూడ రోడ్డువైపు వెళ్లి తిరిగి వచ్చి అక్కడనే ఆగాయి. ఈ హత్యకు ఆక్రమ సంబంధమా లేక ఇంకేమైన కారణాల అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాట్లు తెలిపారు. మృతునికి భార్య భాగ్యమ్మతోపాటు ముగ్గురు కుమారులున్నారు. అనుమానితులను విచారిస్తున్నాట్లు తెలిసింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నాట్లు సీఐ చెప్పారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా