పులిపాడులో మొసలి కలకలం

5 May, 2016 20:07 IST|Sakshi

గుంటూరు జిల్లా గురజాల మండలలోని పులిపాడు గ్రామంలో మొసలి కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పులిపాడు గ్రామ సరిహద్దులో బ్రిడ్జి దగ్గర కొన్నిరోజుల నుంచి ముసలి సంచరిస్తూ కోతులను, లేగదూడలను తింటున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అనంతరం అటవీ శాఖకు సమచారం అందించడంతో ఆ శాఖ అధికారులు స్థానికుడు జమ్మిగుంపుల రాంబాబు సహకారంతో జేసీబీ ద్వారా తవ్వించారు.

వాగుకట్టలో 25 అడుగుల సొరంగంలో మొసలి బయట పడింది. మెసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. మొసలిని పట్టుకొని దగ్గరలో ఉన్న కృష్ణానదిలో వదిలిపెడతామని ఫారెస్టు రేంజ్ అధికారి కె.రామిరెడ్డి తెలిపారు. ఫారెస్టు డిఫ్యూటిరేంజ్ అధికారి జి.రాజశేఖర్ గౌడ్, ఫారెస్టు బీట్ అధికారి ఆర్‌వీఎస్ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు