ఆర్డీటీ మాజీ చైర్మన్‌ ఇన్నయ్య మృతి

2 Dec, 2016 00:05 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్డీటీ) మాజీ చైర్మన్‌ ఇన్నయ్య ఫాదర్‌(85) బుధవారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు. గురువారం ఆయన మృతదేహాన్ని ఆర్డీటీ కార్యాలయానికి తరలించగా, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్, డైరెక్టర్లు చంద్రశేఖర్‌ నాయుడు, దశరథ్, జేవియర్, మల్లారెడ్డి, డోరిన్‌రెడ్డి, మోహన్‌ మురళి తదితరులు నివాళులర్పించారు.

 

మరిన్ని వార్తలు