ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

14 Jun, 2017 22:32 IST|Sakshi
  •  21న జిల్లా ప్లీనరీని విజయవంతం చేయండి
  • జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు శంకరనారాయణ
  • మడకశిర : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

    ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. అనంతపురంలో ఈనెల 21న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో జిల్లా సమస్యలతోపాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనా లోతుగా చర్చిస్తామన్నారు. ప్రధాన సమస్యలపై ఈ ప్లీనరీలో తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.

    జిల్లా వ్యాప్తంగా జరిగిన నియోజకవర్గ ప్లీనరీలు విజయవంతమయ్యాయని, విశేష స్పందన లభించిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామికి సహాయ సహకారాలు అందించి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలని కోరారు.

    ఈ సమావేశంలో ఏడీసీసీ బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్‌ రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఎస్‌ఆర్‌ అంజినరెడ్డి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అనంతరాజు, సోమనాథ్‌రెడ్డి, ఉగ్రప్ప, మడకశిర మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ ఈచలడ్డి హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు