జనగామ జిల్లా ఇక్కడి ప్రజల హక్కు

9 Aug, 2016 00:13 IST|Sakshi
నర్మెట : జనగామ జిల్లా ఈ ప్రాంత ప్రజల హక్కు అని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జనగామను జిల్లా చేయాలని కోరుతూ యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బొత్తలపర్రె–బొంతగట్టునాగారంలోని ఏడుపోచమ్మ దేవాలయం వద్ద నుంచి నర్మెట వరకు సోమవారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ జనగామను 11వ జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి మాట తప్పుతున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ లో ఎంసెట్‌–2 లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల పునర్విభజన తెరపైకి తెచ్చారని చెప్పారు. అనంతరం తహసీల్దార్‌ నర్సయ్యకు పలు వినతులతో కూడినపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బనుక శివరాజ్‌యాదవ్, కీసర దిలీప్‌రెడ్డి, మంసంపల్లి లింగాజీ, తేజావత్‌ గోవర్ధన్, బొక్క సుజయ్, మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్, అర్జుల సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కళ్యాణం లలిత ము రళి, ఎంపీటీసీ సంపత్, గాదర సందీప్, వేముల అంజయ్య తదితరులు ఉన్నారు. 
మరిన్ని వార్తలు