విద్యతో పాటూ సేవాభావం ఉండాలి

21 Jul, 2016 19:02 IST|Sakshi
విద్యతో పాటూ సేవాభావం ఉండాలి


సంగారెడ్డి రూరల్‌:దేశ భవిష్యత్‌ యువత చేతుల్లో ఉందని, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు విద్యతో పాటు సేవాభావం కలిగి ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లిలోని  పీఎస్‌అర్‌ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) శిబిరం ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని సమాజంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కషి చేయాలన్నారు.

తెలంగాణ అభివద్ధికి కషి చేస్తూ సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జోగిపేట జూనియర్‌ కళశాల ప్రిన్సిపాల్‌ కేవీ రావు మాట్లాడుతూ దేశభక్తి   ప్రమాణికంగా ఎన్‌ఎస్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. వాలంటర్లు క్రమశిక్షణతో పాటు ప్రణాళికబద్దంగా చదివి పైకిఎదగాలన్నారు.

అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ గోకుల్‌ కష్ణ, ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధికారులు విష్టుదత్త, ఎమ్‌ఎస్‌ఎన్‌ రెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్‌ను ఘనంగా సన్మనించారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, ఎంఈఓ వెంకటేశం, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు రామప్ప, ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ అల్లం రెడ్డి, ఇన్‌చార్జ్‌ రవితేజ, సీడీసీ డైరెక్టర్‌ జైపాల్‌నాయక్, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటర్లు పాల్గొన్నారు.
 

           
 

మరిన్ని వార్తలు