స్వామి కార్యం.. స్వకార్యం

26 Aug, 2016 23:25 IST|Sakshi
స్వామి కార్యం.. స్వకార్యం

రాయదుర్గంలో నేడు శ్రీనివాస కల్యాణం
•  ప్రైవేట్‌ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రచారం
•  మునిసిపల్, ఆర్‌అండ్‌బీ సిబ్బందితో పనులు
•  దగ్గరుండి పర్యవేక్షిస్తున్నఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం : రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వేదికగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీని వాస కల్యాణం నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్‌మూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రైవేట్‌ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్‌విప్‌ కాలవ శ్రీనివాసులు ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలో ఎటు చూసినా ఇటువంటి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు నియోజకవర్గ ప్రజల బాగు కోసం తనే సొంతంగా కల్యాణోత్సవం జరుపుతున్నట్లు, డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ ఆ హ్వానించడం చర్చనీయాంశమైంది. ‘ఎవరో డబ్బు ఖర్చు చేస్తే.. డింగ్‌ డింగ్‌ యల్లమ్మ జాతర’ అన్న చం దంగా అయిందని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు.  

ప్రజల సమస్యలు గాలికి వదిలి..
రాయదుర్గం పట్టణంతో పాటు వివిధ మండలాల్లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు తీరికలేదు. ఎమ్మెల్యే అజమాయిషీతో.. ప్రైవేటు వ్యక్తి  చేస్తున్న శ్రీనివాస కల్యాణోత్సవ ఏర్పాట్ల పనుల్లో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ఆర్డీఓ రామారావు సైతం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తన సమయం వెచ్చించడం గమనార్హం. కృష్ణా పుష్కరాల పేరుతో రెండు వారాలపాటు అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు శ్రీనివాస కల్యాణోత్సవం పేరుతో మరో వారం రోజులు కష్టాలు తప్పలేదు. పాలకుల మెప్పు పొందడం కోసం అధికారులు తమ సిబ్బందిని పురమాయించి పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega