మార్చి నాటికి మరుగుదొడ్ల నిర్మాణం

22 Sep, 2016 01:38 IST|Sakshi
మార్చి నాటికి మరుగుదొడ్ల నిర్మాణం
 
  • కలెక్టర్‌ ముత్యాలరాజు 
ఆత్మకూరురూరల్‌: మార్చి నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజు పిలుపునిచ్చారు. ఆత్మకూరులో బుధవారం నిర్వహించిన డివిజన్‌ స్థాయి ఆత్మగౌరవం సభలో కలెక్టర్‌ మాట్లాడారు. 5 నెలల కాలంలో 25 శాతం గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన 75 శాతం లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నాను. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యసిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులతో ఒక్క మరణం సంభవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలిసి డివిజన్‌ పరిధిలో నూరుశాతం మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ, డ్వామా పీడీ హరిత,  ఆత్మగౌరవం జిల్లా కోఆర్డినేటర్‌ సుస్మితారెడ్డి, ఆత్మకూరు ఎంపీపీ సిద్దం సుష్మ , ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు