పింఛన్‌ సొమ్ము ‘చుక్క’పాలు

5 Aug, 2016 00:12 IST|Sakshi
పింఛన్‌ సొమ్ము ‘చుక్క’పాలు
హుకుంపేట : మన్యంలో చుక్కలేనిదే బండినడవడం లేదు. ఇల్లు గుల్లవుతున్నా..అనారోగ్యాలకు గురవుతున్నా..‘నాటు’వైపు పరుగులు తీస్తున్నారు. మన్యం మొనగాళ్లే కాకుండా మహిళలు కూడా ప్యాకెట్‌ చింపి గుటుక్కుమని తాగేస్తున్నారు. తీగలవలస పంచాయతీలోని పలు గ్రామాల్లో కొంతమంది గిరిజనులు సారా తయారు చేస్తూ రోజుకు రూ.వేలల్లో వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ తయారైన సారా హుకుంపేట,పాడేరు మండలాలకు రవాణా అవుతుంది.ఎక్సైజ్‌ అధికారులు అనేకసార్లు సారా దాడులు చేపట్టిన ఫలితం లేకపోతుంది. గురువారం ఈ ప్రాంతంలో సారా ఏరులై పారింది. పలుచోట్ల ప్యాకెట్లతో విక్రయాలు జరిగాయి.ఆడ,మగ తేడాలేకుండా సారాను కొనుగోలు చేశారు. కామయ్యపేట వద్ద పింఛను సొమ్ము పంపిణీ చేయడంతో పలు గ్రామాల వద్ధులంతా ఈ డబ్బులో రూ.200 వరకు సారాకే ఖర్చుపెట్టారు.
>
మరిన్ని వార్తలు