జయశంకర్‌ సార్‌కు నివాళి

7 Aug, 2017 23:52 IST|Sakshi
జయశంకర్‌ సార్‌కు నివాళి

ఘనంగా 83వ జయంతి

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లోగల జయశంకర్‌ విగ్రహానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ జయశంకర్‌ సార్‌ చూపిన బాటలో నడవాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గదర్శకునిగా ఉన్న ఆయన స్వరాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం  బాధాకరమన్నారు. ప్రతిఒక్కరూ ప్రొఫెసర్‌ ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, నారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో..
ఆదిలాబాద్‌అర్బన్‌: జయశంకర్‌ సార్‌ జయంతిని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో బానోత్‌ శంకర్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు అహర్నిషలు కృషి చేసిన జయశంకర్‌ సార్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్‌ ఏవో సంజయ్‌కుమార్, పర్యవేక్షకులు సుశీల, ఇన్‌చార్జి డీసీఎస్‌వో తనూజ పాల్గొన్నారు.

పోలీస్‌ క్యాంపు కార్యాలయంలో..
ఆదిలాబాద్‌: పోలీసు క్యాంప్‌ కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మ రువలేనిదన్నారు. స్పెషల్‌బ్రాంచ్‌ ఎస్సైలు అన్వర్‌ ఉల్‌హఖ్, రామన్న, సీసీ పోతరాజు, ఫింగర్‌ప్రింట్‌ అధికా రి అశోక్‌కుమార్, సిబ్బంది కృష్ణమూర్తి, ప్రకాశ్‌రెడ్డి, అ బ్దుల్లా, సత్యనారాయణ, షకీల్, వెంకట్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు