నిన్న ఏం జరిగిందంటే..

13 Oct, 2015 06:15 IST|Sakshi
నిన్న ఏం జరిగిందంటే..

♦ డీహైడ్రేషన్‌తో నీరసించిన ప్రతిపక్షనేత
♦ విషమంగా ఆరోగ్య పరిస్థితి
♦ ప్రమాదకర స్థాయిలో కీటోన్ బాడీస్
♦ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్న వైద్యులు
 
 గుంటూరు మెడికల్: ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై ఆరు రోజులుగా గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా దిగజారుతూ సోమవారానికి విషమంగా మారింది. శరీరం లో నీటి శాతం తగ్గడం(డీహైడ్రేషన్)తో ఆయన బాగా నీరసించారు. ఉదయం కొద్దిసేపే వేదికపై కూర్చుని ఆ తరువాత పడుకుండిపోయారు. పరీక్షల కోసం మూత్రం ఇవ్వడానికి వేదికపై నుంచి దీక్షా శిబిరం వద్ద ఉన్న బస్సులోకి అతి కష్టం మీద వెళ్లారు.

వేదికపై నుంచి ఆయన దిగుతూ ఉండగా కింద పడకుండా పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు ఆసరాను ఇచ్చి తీసుకెళ్లారు. రక్తంలో చక్కెర నిల్వలు బాగా తగ్గడం, కీటోన్‌బాడీస్ పాజిటివ్ రావడం వంటి ప్రమా ద సంకేతాలన్నీ ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి. కీటోన్ బాడీస్ ఎక్కువయ్యేకొద్దీ ఆయన లేచి మాట్లాడ్డానికి కూడా ఇబ్బంది పడిపోయారు. పార్టీ నేతలు కూడా మాట్లాడేటపుడు పడుకుని ఉన్న ఆయనపై ఒరిగిపోయి మాట్లాడాల్సి వచ్చింది. చివరకు సీపీఐ నేతలు వచ్చినా లేవలేని స్థితిలో ఉండటంతో వారు కూడా బాగా వంగి మాట్లాడారు. కీటోన్‌బాడీస్ 3 ప్లస్ ఉండటం వల్ల యాసిడ్ ఎక్కువై గ్లూకోజ్ లెవల్స్ తగ్గి కిడ్నీపై ప్రభావం చూపటంతోపాటు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 పనికిరాని పరికరాలతో పరీక్షలు...
 జగన్ ఈ నెల 7న దీక్షను ప్రారంభించారు. తొలిరోజు మినహాయించి రెండోరోజైన 8వ తేదీ(గురువారం) నుంచీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు ప్రతి రోజూ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఎనిమిదో తేదీన 75 కిలోల బరువున్న జగన్ 12వ తేదీ ఉదయానికి 72.9 కిలోలకు తగ్గారు. 11వ తేదీ ఉదయం జీజీహెచ్ వై ద్యులు నిర్వహించిన పరీక్షల్లో షుగర్ 59 ఎంజీ ఉండగా... సాయంత్రం 4 గంటలకు 79 ఎంజీ, రాత్రి 10.30 గంటలకు 88 ఎంజీ ఉన్నట్లు చూపారు. దీనిపైనే మంత్రులు అపహాస్యం చేశారు.

దీంతో అదే రోజు రాత్రి శిబిరం వద్ద జగన్ వైద్యులను నిలదీశారు. కొత్త పరికరం తెప్పించి పరీక్షించగా 77 ఎం జీగా వచ్చింది. పనికిరాని పాత పరికరాలు తీసుకొచ్చి తనకు రక్త పరీక్షలు నిర్వహిం చడంపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందరే తాను పరీక్షలకు సిద్ధమని సవాలు విసిరారు. రక్తపరీక్షల్లో తేడాలు రావడంపై పార్టీ నేతలు జీజీహెచ్ అధికారులను నిలదీశారు. రక్తం సేకరించాక పరీక్షించడంలో ఆలస్యం వల్లనే హెచ్చుతగ్గు లు వచ్చాయని అధికారులు అంగీకరించా రు. 12వ తేదీ ఉదయం కూడా షుగర్ స్ట్రిప్‌పై 84 ఉండగా, ల్యాబ్‌లో పరీక్షిస్తే 61 ఎంజీ మాత్రమే ఉంది. దీంతో వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపేశారు.
 
 జగన్ ఆరోగ్యం క్షీణించిన క్రమం..
 8వ తేదీ ఉదయం 10.30 గంటలు: బీపీ 120/80, షుగర్ 91ఎంజీ, పల్స్ రేటు 85
 రాత్రి 8.30 గంటలు: బీపీ 130/ 90, షుగర్ 85 ఎంజీ, పల్స్‌రేటు 85. బరువు 75కిలోలు ఉన్నారు.
 9వ తేదీ ఉదయం: బీపీ 110/70,
 షుగర్ 94 ఎంజీ, పల్స్ రేటు 80
 రాత్రి 9 గంటలు: బీపీ 130/90,
 షుగర్ 88ఎంజీ, పల్స్ రేటు 66
 10వ తేదీ ఉదయం 7.30 గంటలు:
 బీపీ 120/90, షుగర్ 87ఎంజీ, పల్స్‌రేటు 66
 మధ్యాహ్నం 1.30 గంటలు: బీపీ 110/ 80, షుగర్ 82 ఎంజీ, పల్స్‌రేటు 70. బరువు74.5 కిలోలు
 రాత్రి 8.30 గంటలు: బీపీ 110/60, షుగర్ 76 ఎంజీ, పల్స్‌రేటు 80, బరువు 73.8 కిలోలు
 11వ తేదీ ఉ.7.45 గంటలు: బీపీ 110/70, షుగర్ 59 ఎంజీ, పల్స్‌రేటు 62, బరువు 73.5 కిలోలు.
 సాయంత్రం 4.00 గంటలు: బీపీ 96/ 60, షుగర్ 79 ఎంజీ, పల్స్ రేటు 86, బరువు 73.5 కిలోలు.
 రాత్రి 10.30 గంటలు: బీపీ 110/ 60, పల్స్ 70, షుగర్ 88 ఎంజీ/ 77 ఎంజీ.
 12వ తేదీ ఉద యం: బీపీ 130/ 90, పల్స్ 80, కీటోన్ బాడీస్ 3 ప్లస్, బరువు 72.9 కిలోలు.
 రాత్రి: బీపీ130/80, పల్స్77, బరువు72.4 కిలోలు

ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం ఉదయం  4 గంటలకు దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులు వైఎస్ జగన్ ను బలవంతంగా జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. 5:10కి వైద్యపరీక్షలు నిర్వహించగా.. కీటోన్స్ లెవల్స్ 4కు చేరుకుంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని గుర్తించిన వైద్యులు.. వైఎస్ జగన్ కు బలవంతంగా ఫ్ల్యూయిడ్స్ ఎక్కిస్తున్నారు.

మరిన్ని వార్తలు