వ్యాక్సిన్‌తో శ్రీరామరక్ష

2 Apr, 2017 22:35 IST|Sakshi
వ్యాక్సిన్‌తో శ్రీరామరక్ష
మిడుతూరు: ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తే  వారి జీవితానికి శ్రీరామరక్షగా ఉంటుందని స్టేట్‌ నోడల్‌ అధికారి వెంకటరత్నం అన్నారు. మండలపరిధిలోని కడుమూరు అంగన్‌వాడీ కేంద్రంలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో 50.92 లక్షల మంది చిన్నారులకు బైవలెంట్‌  పోలియో చుక్కల మందును (వ్యాక్సిన్‌) వేస్తున్నట్లు తెలిపారు.  3,17, 771 వైల్స్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 1,52,672 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి 2008లో ఈస్టు గోదావరి జిల్లా కాకినాడలో, దేశంలో   2011లో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పోలియో కేసు నమోదైందన్నారు. 2014లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తించిందని వివరించారు. వైద్యాధికారి సురేష్‌ కుమార్‌, సూపర్‌వైజర్‌ విలాసకుమారి,  హెల్త్‌ అసిస్టెంట్‌ పార్వతి, ఆంగన్‌ వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు