వెలుగు సీసీ బదిలీ కౌన్సిలింగ్‌లో అవకతవకలు

26 Jul, 2016 00:32 IST|Sakshi
వెలుగు సీసీ బదిలీ కౌన్సిలింగ్‌లో అవకతవకలు
  • రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
  • రంపచోడవరం :
    వెలుగు సీసీ బదిలీ కౌన్సిలింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, తిరిగి కౌన్సిలింగ్‌ నిర్వహించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. రంపచోడవరంలోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం  వెలుగు సీసీలు ఎమ్మెల్యేను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఇప్పటి వరకు ఆయా మండలాల్లో పనిచేస్తున్న వెలుగు సీసీలను సెర్ప్‌ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్‌ నిర్వహించామన్నారు. ఈ కౌన్సిలింగ్‌లో క్యాడర్‌ వారీగా కాకుండా వారికి నచ్చిన విధంగా కౌన్సిలింగ్‌ నిర్వహించారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పనిచేసిన చోట తిరిగి పనిచేయకూడదని నిబంధనలు పెట్టి కొంత మందికి సొంత మండలాల్లో అదే ్ధనంలో కొనసాగించారన్నారు. వికలాంగులకు, గర్భిణిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. తమ కంటే తక్కువ సర్వీసు ఉన్న న్యూట్రిషన్‌ సీసీలను కూడా తమకు ఇష్టమైన వారిని కదపకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజేశ్వరి వెలుగు డీపీఎం పార్థసారథితో ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో చర్చించారు. అవకతవకలతో నిర్వహించిన కౌన్సిలింగ్‌ రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో చర్చించనున్నట్టు తెలిపారు. చింతూరు, రంపచోడవరం ఐటీడీఏలకు వేర్వేరుగా వెలుగు సీసీలకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలన్నారు.
    మరుగుదొడ్లు సొమ్ములేవీ?
    ఏజెన్సీలో స్వచ్ఛ భారత్‌లో నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు చెల్లింపులు జరగడం లేదని ఎమ్మెల్యే వంతల ఆరోపించారు. రాజవొమ్మంగి మండలంలో 250 మంది సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నా నేటికీ బిల్లులు ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ పథకంలో జీడిమామిడి మొక్కలను సరంక్షించుకుంటున్న వాటికి వేతనాలు చెల్లించడం లేదని లక్షలాది రూపాయాలు బకాయిలు ఉన్నట్లు తెలిపారు.
     
మరిన్ని వార్తలు