వెలుగు కార్యక్రమాల అమలు భేష్‌

3 Oct, 2016 23:38 IST|Sakshi
  • ఎన్‌ఆర్‌ఎల్‌ఎం బృందం కితాబు   
  • అనంతపురం టౌన్‌ : జిల్లాలో వెలుగు కార్యక్రమాల అమలు భేషుగ్గా ఉందని జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ప్రతినిధులు  ప్రొఫెసర్‌ శైలేంద్ర, వికాస్, శృతి కితాబిచ్చారు. సోమవారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాలపై వారు చర్చించారు.  

    డీఆర్‌డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు   పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పథకాలను వివరించారు.  బృందం సభ్యుల  సందేహాలను నివృత్తి చేశారు. ఈ బృందం మంగళ, బుధవారం యల్లనూరు, 6, 7వ తేదీల్లో రామగిరి మండలాల్లో పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో పథకాల అమలును పరిశీలించి ప్రగతి నివేదికలు జిల్లా అధికారులకు అందివ్వనున్నారు.  అదనపు పీడీ సుబ్బరాయుడు, ఏఓ శ్రీనివాసులు డీపీఎంలు రామ్మోహన్, నరసయ్య, ఈశ్వరయ్య, రాధారాణి, సత్యనారాయణ,  పాల్గొన్నారు.


    పాలక వర్గ సభ్యులతో సమావేశం
    జిల్లా సమాఖ్యకు చెందిన పది మంది పాలకవర్గ సభ్యులతో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ప్రతినిధులు ప్రత్యేకంగాసమావేశమయ్యారు.   సమాఖ్య నిర్వహణ, ఆదాయ వనరులు, సబ్‌ కమిటీల పనితీరు, కాల్‌ సెంటర్, అన్న సంజీవిని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నిర్వహణపై చర్చించారు.   మహిళా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.పార్వతమ్మ,  సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు