యుద్ధ నౌకలో విజ్ఞాన యాత్ర

12 Dec, 2016 15:15 IST|Sakshi
యుద్ధ నౌకలో విజ్ఞాన యాత్ర

నడిసంద్రంలో విన్యాసాల హోరు
నావికాదళ సత్తా చాటేలా ప్రదర్శనలు
విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం
ఘనంగా సముద్రంలో ఒక రోజు

ఒకటి కాదు.. రెండు కాదు.. శత్రుభీకరమైన ఆరు యుద్ధనౌకలు.. వాటికి తోడుగా ఓ సబ్‌మెరైన్.. హెలికాప్టర్లు.. యుద్ధ విమానాలు.. అవి చేసిన విన్యాసాలు.. సమర సన్నద్ధత ప్రదర్శనలు.. రెస్క్యూ ఆపరేషన్లు.. వెరసి నడిసంద్రంలో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారుు. వేలాది విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు విజ్ఞానం.. వినోదం అందించారుు. నేవీడే ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన డే ఎట్ సీ(సముద్రంలో ఒక రోజు) కార్యక్రమం గగుర్పాటు కలిగించింది.

ప్రతినిధి, విశాఖపట్నం:  యుద్ధ నౌకల బారులు.. ఆరుుల్ ట్యాంకర్ కమ్ వార్‌షిప్ ఐఎన్‌ఎస్ శక్తి నౌక, సబ్‌మెరైన్ సింధువీర్.. అదనంగా హైస్పీడ్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లు టి 36, టి 37, టి38, టి39..  నడిసంద్రంలో వేగంగా వెళ్తుండగా.. గగనతలంలో రెండు యుద్ధ విమానాలు. మూడు సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు. మరో రెండు  రెండు హాక్ ఫైటర్ ఎరుుర్‌క్రాఫ్ట్‌లు...  ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలకు నడిసంద్రమే వేదికై ంది. నగరంలోని వివిధ పాఠశాలలతోపాటు, కోరుకొండ సైనిక్ స్కూల్, భువనేశ్వర్‌లోని సైనిక్ స్కూళ్లకు చెందిన సుమారు రెండున్నర వేలమంది విద్యార్థులు, నగరంలోని సీనియర్ సిటిజన్లు, మీడియా ప్రతినిధులను నేవీ అధికారులు నౌకల్లో విశాఖ తీరం నుంచి  20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలోకి తీసుకువెళ్లారు. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యలో సుమారు ఐదుగంటల పాటు ఏకబిగిన సాగిన విన్యాసాలు విద్యార్ధులు, చూపరులను సంద్రమాశ్చర్యాల్లో ముంచెత్తారుు.

►యుద్ధనౌకలు వరుసగా ఒకదాని వెంట ఒకటి.. కొంత దూరం తర్వాత ఐదు యుద్ధ నౌకలు పక్క పక్కనే ఒకే వేగంతో ప్రయాణించడం, ఎడమ వైపు సత్పుర..  కుడి వైపు శివాలిక్ .. మధ్యలో శక్తి యుద్ధనౌక స్థిరవేగంతో ప్రయాణిస్తూ ఒకదాని నుంచి మరొకటి డీజిల్ నింపుకోవడం, సత్పుర, శివాలిక్‌ల నుంచి కేవలం తాడు సాయంతో నావికులు శక్తి నౌకలోకి ప్రవేశించడం, పై నుంచి వేగంగా వచ్చిన హెలికాప్టర్ నుంచి ఓ వ్యక్తి సముద్రంలో ఉన్న హైస్పీడ్ బోటులోకి దిగడం.. వంటి అరుదైన విన్యాసాలు విద్యార్థులు, చూపరులను అబ్బురుపరిచారుు. నేవీ సత్తా, విపత్కర, యుద్ధ సమయాల్లో అది స్పందించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు.

►విపత్తులు, యుద్ధాల సమయంలో నావికాదళం ఏవిధంగా స్పందిస్తుంది.. వేగవంతమైన మోటారు పడవలు(ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్‌లు ) సముద్రంలో ఎలా వెళ్తారుు,  యుద్ధ నౌకలు ప్రయాణిస్తుండగానే వాటిలో ఇంధనాన్ని ఎలా నింపుకుంటారు, శత్రు సైనికులు, ఉగ్రవాదులపై యుద్ధనౌకల్లో నుంచి అత్యాధునిక మెషిన్‌గన్లతో దాడి జరిపే తీరు.. నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో జలాంతర్గాముల్ని ఏ విధంగా గుర్తిస్తారుు, యుద్ధ నౌకల్లో  నావికులు ఒకదాని నుంచి మరో నౌకలోకి తాడు సాయంతో ఎలా వెళ్తారు. సముద్రంలో  చిక్కుకుపోరుున వారిని హెలికాప్టర్ల ద్వారా ఏవిధంగా రక్షిస్తారు..  జలాంతర్గాముల రాకపోకలు ఎలా ఉంటాయన్న అంశాలు ప్రదర్శించారు.

యుద్ధ నౌకలివే..
సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు, యుద్ధ విన్యాసాలు చూపించేందుకు ఐఎన్‌ఎస్ శక్తి, శివాలిక్, సత్పుర, రణ్‌విజయ్, సుకన్య, కోరా, కాట్మా, కుంజర్ యుద్ధ నౌకలను వినియోగించారు. వీటితో పాటు సింధువీర్ జలాంతర్గామి పాల్గొంది. చేతక్, కమావ్-28, సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం రెండు హాక్ ఫైటర్ (అడ్వాన్‌‌స జెట్ ట్రైనర్) ఎరుుర్‌క్రాఫ్ట్‌లు, రెండు యుద్ధ విమానాలు డార్నియర్, పి8ఐ విన్యాసాలను ప్రదర్శించారు. పి8ఐ విమానాన్ని  ఇటీవలే అమెరికా నుంచి కొనుగోలు చేసి బహుళార్ధ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు ఫ్లీట్ కమాండర్ బి.దాస్ గుప్తా వెల్లడించారు  .

మరిన్ని వార్తలు