పంటలు కాపాడేందుకు నీరందిస్తాం

11 Nov, 2016 23:00 IST|Sakshi
పంటలు కాపాడేందుకు నీరందిస్తాం
 
  • నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సీఈ వీర్రాజు 
విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేసిన పంట పొలాలకు పూర్తిగా నీరు అందిస్తామని ప్రాజెక్టు సీఈ వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన సాగర్‌ కుడికాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపై నున్న కంట్రోల్‌ రూమ్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వేసిన 9.5 లక్షల ఎకరాల పంటపొలాలను కాపాడేందుకు ఒక తడి పూర్తిగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గుంటూరు బ్రాంచ్‌ కెనాల్స్‌ కింద వేసిన 2లక్షల ఎకరాలలో ఇప్పటికే లక్ష ఎకరాల భూమి తడిసిందని మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు చెప్పారు. జూలకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి తంగిడ, ఆకురాజుపల్లిలోని మిరప పంటలకు మరో తడి నీరు ఇస్తే పంట రైతు చేతికి అంది వస్తుందన్నారు. సాగర్‌ జలాశయంలో నీరు తక్కువుగా ఉందని దీనిని దష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటలను వేయవద్దని సూచించారు. రైతులను రబీ పంటలను వేస్తే పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కుడికాలువపై అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ మోటార్ల కనెక్షన్లు తొలగించేందుకు నీటిసంఘాలు పోలీసుల సహకారంతో ప్రత్యేక బందాలను ఏర్పాటు చే యాలని కోరారు. చివరి ఆయకట్టు భూముల వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం సాగు, తాగు నీటికి విడుదల చేస్తున్న 10 టీఎంసీలలో ఇప్పటికే 7.5 టీఎంసీలు విడుదల చేశామని వివరించారు. మరో మూడు రోజులలో నీటి విడుదల పూర్తవుతుందన్నారు. మరో 3 టీఎంసీల నీటి అవసరం ఉందనే విషయాన్ని ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట కుడికాలువ డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరావు, జేఈలు లక్ష్మీనారాయణ, కేశవరావు, సత్యనారాయణ ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు