నీరు-చెట్టు పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు

19 Jun, 2016 09:08 IST|Sakshi
నీరు-చెట్టు పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 
పొదలకూరు: నీరు-చెట్టు, ఉపాధిహామీ పనులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన మండలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చేసిన పనులకే అంచనాలు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇరిగేషన్ ఏఈ కరిము ల్లా మండలంలో చేపడుతున్న నీరు-చెట్టు పనుల వివరాలను తెలియజేయగా, ఎమ్మెల్యే గతంలో నీరు-చెట్టు కింద చేపట్టిన పనుల వివరాలు ఉన్నా యా? అని ప్రశ్నించారు.

దీంతో ఏఈ నీళ్లు నమిలి తన వద్ద సరైన సమాచారం లేదన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గుంతలను చూపించి బిల్లులు చేసుకుంటున్నట్లు  అందుతున్న ఫిర్యాదులను కలెక్టర్ దృ ష్టికి తీసుకువెళ్తామన్నారు. ఫారంఫాండ్‌‌స పనులను యంత్రాలతో చేపట్టి నిధులను స్వాహా చేయడంపై విజిలెన్స్‌కు ఆధారాలతో సహా నివే దిస్తామన్నారు.


గ్రామసభలు ఏర్పాటు చేయాలి
జన్మభూమి కమిటీలతో సంబం ధం లేకుండా గ్రామసభలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కాకాణి అధికారులకు సూచించారు.కొత్త నిబంధలన ప్రకారం గృహనిర్మాణశాఖ అధికారులు గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయా ల్సి ఉందన్నారు. నిబంధనలు పాటించకుంటే అధికారులు ఇబ్బందు లు పడాల్సి వస్తుందన్నారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీడీఓ సీహెచ్ శ్రీహరి, డి ప్యూటీ త హసీల్దార్ బీ మురళీ  పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు