గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం

14 Feb, 2017 22:25 IST|Sakshi
గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి
– పార్టీ శ్రేణులకు అనంతవెంకట్రామిరెడ్డి పిలుపు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించుకుని వైఎస్‌ఆర్‌సీపీ సత్తా ఏమిటో చాటుదామని పార్టీ శ్రేణులకు జిల్లా పరిశీలకుడు అనంతవెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని  పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిషా​‍్టత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు  గట్టి కృషి చేయాలని కోరారు. జిల్లాలో 82 వేలు,  కర్నూలు నగరంలో 36 వేల పట్టభద్ర ఓటర్లు ఉన్నారన్నారు.
 
గత ఎన్నికల హామీలు అమలు చేయనందుకు ప్రభుత్వంపై వారికి వ్యతిరేకత ఉందని చెపా​‍్పరు.  పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన  వెన్నపూస గోపాల్‌రెడ్డికి కార్మిక, కర్షక, ఉద్యోగుల సమస్యలపై మంచి అవగాహన ఉందని పట్టభద్రులు  మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకు వేసేలా చూడాలనానరు.  ఓటును ఎలా ఉపయోగించుకోవాలో వారికి అవగాహన కల్పించాలని  పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గాల ఇన్‌చార్జీల జాబితా విడుదల చేశారు.
 
గేట్‌వే ఆఫ్‌ ది ఎలక​‍్షన్స్‌ టు వైఎస్‌ఆర్‌సీపీ..
వైఎస్‌ఆర్‌సీపీకి ఇవి గేట్‌వే ఆఫ్‌ ది ఎలక​‍్షన్స్‌ అని, మేధావులంతా తమకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు. నిత్యం అబద్ధాలతో కాలం గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలుపుకోసం జిమ్మిక్కులు చేసేందుకు ప్రయత్నిస్తారని, దాన్ని పసిగట్టి తిప్పికొట్టాలన్నారు.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులు సైతం విదేశాలకు వెళ్లి చదువుకోగలుగుతున్నారన్నారు. అలాంటి పాలన రావాలంటే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయం పట్టభద్రులకు తెలియజేయాలన్నారు.  బుధవారం అనంతపురంలో జరిగే నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
 
మరిన్ని వార్తలు