నిర్భయ చట్టం పక్కా అమలుకు చర్యలు

25 Oct, 2016 17:39 IST|Sakshi
నిర్భయ చట్టం పక్కా అమలుకు చర్యలు
రాష్ట్ర మహిళా కమిషన్‌ 
చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి
 
గుంటూరు వెస్ట్‌: నిర్భయ చట్టం అమలులో ఉన్నా మహిళలపై దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయని, చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. కమిషన్‌ ప్రథమ సమావేశం రాజకుమారి అధ్యక్షతన గుంటూరులోని ఒక ప్రైవేట్‌ హాస్పటల్‌లో సోమవారం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్, టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మహిళా కమిషన్‌కు వెబ్‌సైట్‌ రూపొందిస్తామన్నారు. బాల్య వివాహాలతో సమాజం అనారోగ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళా కమిషన్‌కు ప్రభుత్వ కార్యాలయం, సిబ్బంది కొరత ఉందని, ఇంకా బడ్జెట్‌ కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం వికాస్‌నగర్‌ రెండో లైన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ కార్యాలయాన్ని గుంటూరులోనే పెద్ద భవనంలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వెల్లడించారు. సమావేశంలో మహిళా కమిషన్‌ సభ్యులు పర్వీన్‌భాను, ఎం మణికుమారి, శ్రీవాణి, డాక్టర్‌ ఎస్‌ రాజ్యలక్ష్మి, టీ రమాదేవి, కమిషన్‌ డైరెక్టర్‌ సూయెజ్, సెక్రటరీ భాను తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు