రోడ్లకు మోక్షమెప్పుడో..!

5 Jul, 2017 00:55 IST|Sakshi

► మిషన్‌ అంత్యోదయ పథకంతో సమగ్రాభివృద్ధి
► పేదరిక నిర్మూలనే లక్ష్యం     
► జిల్లాలో 33 గ్రామాలు ఎంపిక


బాగా వెనుకబడిన పల్లెలకు మహర్దశ రానుంది. ఇలాంటి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అంత్యోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో వంటషెడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ఆసిఫాబాద్‌: జిల్లాలోని 15 మండలాల్లో 173 గ్రామపంచాయతీలు, 431 రెవె న్యూ గ్రామాలున్నాయి. వీటిలో 5,15,812 జానాభా ఉండగా, 4,28,828 మంది, 83.14శాతం జ నాభా గ్రామీణ జనాభా ఉంది. జిల్లాలో అభివృద్ధిలో వెనుక బడిన 33 గ్రామాలను మిషన్‌ అంత్యోదయ పథకం కింద ఎంపిక చేశారు.

జాతిపి త మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అక్టోబర్‌ 2, 2019 నాటికి అన్ని రంగాల్లో పూర్తిస్థాయి ప్రగతి సాధించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి వెనుకబడిన గ్రామాలను గుర్తించి మిషన్‌ అంత్యోదయ కింద ఎంపిక చేశారు. అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఈ నిధులతో  ఎంపికైన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీటితోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా..
పల్లెల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మిషన్‌ అంత్యోదయ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఆదర్శ గ్రామాలు, వివాదరహిత, నేరరహిత గ్రామాలు, ఉత్తమ గ్రామపంచాయతీలతోపాటు ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకొని మిషన్‌ అంత్యోదయ పథకంలో గ్రామాల ఎంపికకు ప్రాధాన్యత ఇచ్చారు. 2019  అక్టోబర్, 2 మహాత్మాగాంధీ జయంతి నాటికి 50 వేల గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలన చేయడమే ప్రధాన ఉద్దేశం.

మహిళలు ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత నివ్వడం, పల్లెల్లో ప్రతీ కుటుంబంలోని మహిళలు పొదుపు సంఘాల్లో చేర్పించడం, నిరుపేద యువతీ, యువకులకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందుకోసం అవసరమైతే ఉపాధి హామీ నిధులు మళ్లించనున్నారు. గ్రామసభల ద్వారా మౌలిక వసతులు గుర్తించి, అవసరమున్న నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. మంజూరైన నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి.

అన్నిశాఖల  సమన్వయంతో అభివృద్ధి
జిల్లాలో ప్రస్తుతం అ న్ని శాఖల ద్వారా అ భివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమన్వయంతో పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఉపాధిహామీ పనులు, పాఠశాలల్లో మౌలి క వసతులు, వంటషెడ్లు, మరుగుదొడ్లు, గొర్రెల పెంపకానికి షెడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, పారిశుధ్య పనులను మిషన్‌ అంత్యోదయ కింద చేపడతాం.
– శంకర్, డీఆర్డీవో, ఆసిఫాబాద్‌

మరిన్ని వార్తలు