అ అంటే అమరావతి కాదు...

21 Feb, 2016 10:53 IST|Sakshi

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్పై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్కే నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ... మాస్టర్ ప్లాన్పై ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

గుంటూరు జిల్లాలో అవగాహన సదస్సు నిర్వహించకుండా తుది మాస్టర్ప్లాన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాస్టర్ప్లాన్పై గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతుల అభ్యంతరాలు పట్టించుకోరా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అ అంటే అమరావతి కాదు... చంద్రబాబు అవినీతి అని ఈ సందర్భంగా ఆర్కే ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు