సూట్‌కేసు వర్సెస్ సూటూ బూటూ

31 May, 2015 00:02 IST|Sakshi
సూట్‌కేసు వర్సెస్ సూటూ బూటూ

చురకలు తగిలించడంలో ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధహస్తుడు. భోజమహారాజు ముఖం చూస్తే ఎలాంటి వారికైనా కవిత్వం ఉప్పొంగేదట. చిన్న తేడాతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మాట్లాడినా అంతే. ఆయన ప్రతి పలుకూ వ్యంగ్యంతో రెచ్చిపోవడానికి వైరులకు పుష్కలంగా ప్రేరణ ఇస్తుంది. ఇంక మోదీ సంగతి చెప్పాలా? అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చినపుడు మోదీ పది లక్షల రూపాయల సూటు వేసుకున్నారు, హవ్వ అంటూ బుగ్గలు నొక్కుకున్నారు రాహుల్‌జీ.

తరువాత ఆ సూటు వేలం వేశారు. కానీ రాహుల్, మోదీ సూట్లని మరచిపోలేక పోతున్నారు. అందుకే, మోదీ ప్రభుత్వం సూటూ బూటూ గాళ్లదేనని రాహుల్ మళ్లీ విమర్శించారు. దీనికే, ఒక వార్తాసంస్థ సంపాదకురాలు స్మితా ప్రకాశ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటూ బూటూగాళ్ల పాలన, సూట్‌కేసుల గాళ్ల పాలన కంటే చాలా మెరుగేమరి అన్నారు మోదీ. అయినా ఆరు దశాబ్దాల పాలనలో ఏనాడూ పేదవాడు గుర్తుకురాని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ల మీద అలా ప్రేమ వరదలా ఉప్పొంగడం ఎందుకో? అని కూడా అన్నారాయన.
 
 

మరిన్ని వార్తలు