బుల్లెట్కీ, బ్యాలెట్కీ 'అమ్మ' ఒక్కటే

27 Mar, 2014 11:49 IST|Sakshi
బుల్లెట్కీ, బ్యాలెట్కీ 'అమ్మ' ఒక్కటే

బుల్లెట్ వర్సెస్ బ్యాలెట్.... తూటా కి ఓటుకి పోటీ... ఈ మాట చాలా సార్లు వింటూనే ఉంటాం. కానీ బుల్లెట్, బ్యాలెట్ ఈ రెండు పదాల మూలం ఒకటే. బాల్ అంటే బంతి అనే పదం నుంచే ఈ రెండూ పుట్టుకొచ్చాయి.


గ్రీకు రిపబ్లిక్ లలో ఎవరినైనా సభ్యుడిగా ఎన్నుకోవాలంటే ఇలాగే అందరి అభిప్రాయాలను తెలుసుకునేవారు. చివరికి ఆయన్ని సభ్యుడిగా చేర్చుకోవాలనుకుంటే ఒక తెల్లని బంతిని జారవిడిచేవారు. వద్దనుకుంటే నల్లబంతిని వదిలేవారు. ఇలా నిర్ణయం తీసుకునే ప్రక్రియను క్రమేపీ బ్యాలెట్ అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి బ్యాలెట్ పర్యాయపదంగా మారిపోయింది.


అలాగే పోటీకి నిలుచున్న అభ్యర్థిని కేండిడేటస్ అనేవారు. దాని అర్థం తెల్లని దుస్తులు ధరించిన వాడు. తమాషా ఏమిటంటే మన దేశంలో తెల్లని దుస్తులు ఇప్పటికీ రాజకీయ నాయకుల ట్రేడ్ మార్క్ గా ఉంటూ వస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు