ఎన్డీఏకు ఎండమావే!

4 May, 2014 04:58 IST|Sakshi
ఎన్డీఏకు ఎండమావే!

పూర్తి మెజారిటీ అనుమానమే.. 225 సీట్లు వస్తే అదే గొప్ప
 
బీజేపీ నాయుకత్వంలోని ఎన్డీఏ కూటమికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో 275 సీట్లు ఖాయుంగా వస్తాయునే ప్రచారం ఈ మధ్య మీడియూలో జోరందుకుంది. కాషాయు కూటమికి 230 సీట్ల దాకా వస్తాయని ఏప్రిల్ మొదటి వారంలో సర్వేలు చెప్పిన అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ‘ప్రభంజనం’తో ఎన్డీఏ ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే ఈ నెలాఖరులో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేయుబోతున్నట్టు జోస్యాలు జోరందుకున్నాయి. కానీ... దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఎన్డీఏ హవా ఎండమావే తప్ప అందులో వాస్తవం పెద్దగా లేదని చెప్పవచ్చు.

ఎంత సానుకూల ధోరణితో అంచనా వేసినా బీజేపీ బలం ప్రస్తుతమున్న 116 నుంచి దాని రికార్డయిన 182 సమీపానికి వెళ్లవచ్చేమో తప్ప సొంతంగా 200 సీట్లు దాటే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ విషయూనికి వస్తే ఎంత చెడినా దాని బలం 100 కంటే దిగదనే సూచనలున్నారుు. ఎన్డీఏ, యూపీఏ రెండు కూటవుులకు చెందని ఎస్పీ, బీఎస్పీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, తృణవుూల్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, జేడీయుూ, ఐఎన్‌ఎల్‌డీ వంటి బలమైన ప్రాంతీయు పార్టీలు గెలుచుకునే సీట్లే ఎలా చూసినా కనీసం 150 దాటే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారుు. ఇదే నిజమైతే కాంగ్రెస్ బయుటి నుంచి మద్దతిస్తే కేంద్రంలో తృతీయు కూటమి సర్కారు కూడా సాధ్యమే. ఈ లెక్కన ‘మోడీ గాలి’ తదితర కారణాలన్నీ కలిసినా బీజేపీ, దాని మిత్రపక్షాలతో కూడిన ఎన్డీఏ బలం రెండొందల పాతిక దాటే పరిస్థితులైతే లేవని ఎన్నో ఎన్నికలు చూసిన రాజకీయు విశ్లేషకులు చెబుతున్నారు...
 
 నాంచారయ్య మెరుగుమాల
 పదేళ్లుగా కేంద్రంలో పాలన సాగిస్తున్న యుూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ అంటే జనంలో ఆగ్రహావేశాలు కనిపిస్తున్న వూట నిజమే. వృద్ధిరేటు బాగుందని కేంద్ర ఆర్థికవుంత్రి పి.చిదంబరం ఎంత వాదిస్తున్నా చదువుకున్న యుువతకు ఉద్యోగాలు లేవు. ధరలు పెరిగారుు. అన్నిటికీ మించి యుూపీఏ ప్రభుత్వ హయూంలో పెరిగిన అవినీతి, కుంభకోణాలు కాంగ్రెస్‌ను, దాని మిత్రపక్షాలను చావుదెబ్బ తీయుడానికి ప్రజలను సిద్ధం చేశాయునేదీ వాస్తవమే. అరుుతే, జనంలో గూడుకట్టుకున్న ఈ ప్రభుత్వ వ్యతిరేకత మొత్తాన్ని బీజేపీ కూటమి వూత్రమే సొవుు్మ చేసుకుని ఆ వ్యతిరేకతను లోక్‌సభ సీట్ల రూపంలోకి వూర్చుకుంటుందనే అంచనా అతిశయోక్తిగానే తోస్తోంది. మహా అయితే బీజేపీ అధికారంలో ఉండి వుంచి పాలన అందిస్తున్న రాష్ట్రాల్లో దాని బలం పెరగవచ్చేమో. బీహార్‌లో జేడీ(యుూ), పశ్చివు బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజూ జనతాదళ్, ఉత్తరప్రదేశ్‌లో పాలక సమాజ్‌వాదీ, తెలంగాణలో టీఆర్‌ఎస్, సీవూంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్... ఈ పార్టీలన్నీ ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతున్న కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా చాలా మంచి ఫలితాలు సాధిస్తాయుని క్షేత్రస్థారుులో జరిపిన రాజకీయు పరిశీలకుల పరిశోధనలో తేలింది.

 గురి తప్పుతున్న సర్వేలు
 ఎన్నికల సర్వేలు ఎలా బోల్తా పడుతున్నదీ ప్రతిసారీ చూస్తూనే ఉన్నాం. 2009 ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి మెరుగైన ఫలితాలు సాధించబోతోందనీ, కాంగ్రెస్ 133, బీజేపీ 144 సీట్లు సాధిస్తాయుని ఓ ప్రవుుఖ మీడియూ సంస్థ చెప్పిన జోస్యం తప్పింది. బహువుుఖ పోటీలుండే ఉత్తరప్రదేశ్, బీహార్ ఫలితాలపై సర్వేల లెక్కలు బోల్తా పడ్డారుు. యుూపీలో బీజేపీకి వుంచి మొత్తంలో సీట్లు వస్తాయుని సర్వేలు చెప్పినా చివరికి దానికి దక్కింది 10 సీట్లే. బీహార్‌పై అంచనాలూ పూర్తిగా తప్పారుు. సీవూంధ్రలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోందని వూర్చి గత నవంబర్ నుంచి ఇటీవలి దాకా ముక్త కంఠంతో జోస్యం చెప్పిన మీడియూ సంస్థలు కాస్తా... ఏప్రిల్ ఆరంభం నుంచీ బాణీ వూర్చడం మొదలెట్టారుు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోగానే ఒక్కసారిగా అంచనాలను మార్చేశాయి. వైఎస్సార్‌సీపీకి పడతాయని అంచనా వేసిన ఓట్ల నుంచి ఏకంగా 10 శాతం ఓట్లు తీసుకెళ్లి టీడీపీ-బీజేపీ కూటమి ఖాతాలో వేశాయి. మూడు సంస్థలు ఈ మేరకు వెంటవెంటనే సర్వేల ఫలితాలను టీవీ చానళ్లలో ప్రసారం చేశాయి. కేవలం నెల రోజుల్లో ఒక పార్టీ ఇలా ఏకంగా 10 శాతం ఓట్లను ఎలా కోల్పోరుుందో ఎవరూ వివరించలేదు. పైగా వాటిలో ఒకట్రెండు వార్తా చానళ్లు తవు అంచనాలను మళ్లీ వూర్చి కొంత బ్యాలెన్స్ చేసే ప్రయుత్నం కూడా చేశారుు!

 కొత్త బలం పెరిగేదెక్కడ?
 కిందటేడాది బీజేపీ అధికారం కోల్పోరుున కర్ణాటక, బీజేడీతో ఐదేళ్ల క్రితం పొత్తు తెగిన ఒరిస్సా, తృణవుూల్ వేగంగా బలపడుతున్న పశ్చివు బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాషాయు పక్షం బలం ఏమత్రం పెరిగే అవకాశం లేదు. పైగా కర్ణాటకలో బీజేపీ సీట్లు ఈసారి కనీసం మూడో వంతుకు తగ్గిపోవడం ఖాయమంటున్నారు. మీడియూ సంస్థల అంచనాలు, ఆర్భాటం నేపథ్యంలో కొన్ని ప్రధాన రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిద్దాం...

 ఉత్తరప్రదేశ్... ఉత్తి అంచనాలే
 మోడీ గాలితో బీజేపీకి ఏకంగా 41 సీట్లు పెరిగి, మొత్తం 51 సీట్లు కైవసం చేసుకుంటుందని ఎన్డీటీవీ సర్వే ఏప్రిల్‌లో లెక్కకట్టింది. 21 కోట్ల జనాభా, హిందువుల్లో వివిధ వర్గాలు, దాదాపు 18 శాతం ముస్లింలు, భిన్న నేపథ్యాలున్న ప్రజలతో నిండిన యూపీలో కాషాయ పార్టీకి ఇన్ని స్థానాలు రావడం ఏ రకంగా చూసినా అసాధ్యమే. 80 సీట్లున్న యుూపీలో ఎస్పీకి 14, బీఎస్పీకి 10 సీట్లు మాత్రమే వస్తాయంటే నమ్మడం కష్టం. ముజఫర్‌నగర్ మతఘర్షణల ఫలితంగా పశ్చిమ యూపీలోని ముస్లింలు ఎస్పీకి దూరం కావచ్చేమో గానీ కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం ఓట్లు వేయరు. వారికి బీఎస్పీ రూపంలో స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది. పోలింగ్ పూర్తయిన పశ్చిమ యూపీ, దాని పక్కనే ఉన్న రోహిల్‌ఖండ్, నైరుతి యూపీల్లోని ముస్లింలు కూడా వ్యూహాత్మకంగా ఓటేశారనే వార్తలొచ్చాయి. కొన్ని చోట్ల ఎస్పీ, మరికొన్ని సీట్లలో బీఎస్పీకి ముస్లింలు, బీసీలు పెద్ద సంఖ్యలో ఓటేశారనడానికి ఆధారాలు కనిపించాయి.

 బీహార్‌లో అత్తెసరే
 యూపీ తర్వాత మోడీ హవా విపరీతంగా ఉందని ప్రచారంలో ఉన్న రాష్ట్రం బీహార్. మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ, దాని మిత్రపక్షం ఎల్జేపీకి కలిపి ఏకంగా 24 సీట్లు వస్తాయనీ, అంటే కిందటిసారి కంటే 12 స్థానాలు పెరుగుతాయని హోరెత్తిస్తున్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 6 నుంచి 12కు పరిమితం కావచ్చంటున్నారు. కానీ పాలక పక్షమైన జేడీ(యూ) బలం 20 నుంచి ఏకంగా 4 సీట్లకు పడిపోతుందనే వాదన నమ్మశక్యంగా లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక యాదవులు, ముస్లిం మద్దతుతో పాటు ఇతర వర్గాలు మొగ్గు చూపడంతో ఆర్జేడీ కూటమి బలం 18 వరకూ పెరిగే అవకాశం ఉందని తాజాగా బీహార్ ఎన్నికల విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. జేడీ(యూ)తో పొత్తుతో 2009లో 12 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీకి ఒంటరి పోరులో స్కోరు రెట్టింపయ్యే వీలు లేనే లేదు.

 పంజాబ్‌లో ఎదురు గాలే
 13 లోక్‌సభ స్థానాలున్న పంజాబ్‌లో ఏడేళ్లుగా అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ కూటమిపై జనంలో వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా, సర్వేలు అందుకు విరుద్ధమైన అంచనాలు వేశాయి! ఈ కూటమి బలం ఇప్పుడున్న 5 సీట్ల నుంచి 7కు పెరుగుతుందని చెప్పాయి. కాంగ్రెస్ స్కోరు 8 నుంచి 6కు తగ్గుతుందన్నాయి. అకాలీలపై జనంలో వ్యతిరేకత, మాదకద్రవ్యాల వ్యాపారులతో పాలకులకు సంబంధాలున్నాయని జనం నమ్మడం, ఏడేళ్ల పాలనపై అసంతృప్తి వంటివాటి వల్ల పాలక కూటమి బలం తగ్గడమే తప్ప పెరిగే వీలు ఏమాత్రం లేదు. అవృుత్‌సర్‌లో బీజేపీ ప్రముఖుడు అరుణ్ జైట్లీపై మాజీ కాంగ్రెస్ సీఎం అమరీందర్‌సింగ్ నిలబడటం, సీఎం బాదల్ సోదరుడి కొడుకు మన్‌ప్రీత్ బాదల్ నేతృత్వంలోని పీపుల్స్‌పార్టీ ఆఫ్ పంజాబ్‌తో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా అకాలీలకు ఎదురు దెబ్బలు తప్పవనిపిస్తోంది. అదీగాక ఆమ్‌ఆద్మీ పార్టీ రంగంలో ఉన్నందున యూపీఏ వ్యతిరేక ఓట్లన్నీ అకాలీ కూటమికి పడవు.

 బెంగాల్లో తెల్లముఖమే!
 కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని 19 సీట్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ బలం ఈసారి 27-30 సీట్ల వరకూ పెరగవచ్చని సర్వేలు జోస్యం చెప్పాయి. 42 సీట్లున్న బెంగాల్‌లో 6 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది. బీజేపీ 2009లో ఒక్క డార్జిలింగ్‌లో మాత్రమే గెలిచింది. ఈసారి బెంగాల్లో బీజేపీ 6 స్థానాలు గెలుస్తుందన్న అంచనాలను అటుంచితే, కనీసం ఉన్న ఒక్క సీటును నిలబెట్టుకోవడమే దానికి పెద్ద సమస్య అంటే అతిశయోక్తి కాదు.

 మధ్యప్రదేశ్
 రాజస్థాన్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రంలో కిందటిసారి బీజేపీ 16, కాంగ్రెస్, 12, బీఎస్పీ ఒక సీటు గెలిచాయి. ఈసారి బీజేపీకి మరో 8 సీట్లు పెరుగుతాయని కొన్ని సర్వేలు జోస్యం చెప్పాయి. కానీ ఇక్కడ గత రెండుసార్లూ ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఫలితాలను లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించలేకపోయింది. ఆ లెక్కన ఈసారి కూడా బీజేపీ బలం 16-18 సీట్లకే పరిమితమౌతుంది. ఏతావతా ఇక్కడి నుంచి బీజేపీకి అదనంగా వచ్చే సీట్లేమీ ఉండకపోవచ్చు.

 గుజరాత్ కూడా ఆదుకోకపోవచ్చు
 మోడీ పాలించే ఈ రాష్ట్రంలో బీజేపీ బలం ప్రస్తుతమున్న 15 నుంచి 22 సీట్ల వరకూ పెరగొచ్చని అంచనాలు వేశారు. కాంగ్రెస్ ఏడు సీట్లు కోల్పోయి నాలుగు స్థానాలకు పరిమితమౌతుందని లెక్కవేశారు. 37 ఏళ్ల తర్వాత ఓ గుజరాతీకి మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం వస్తోందనే ఉత్సాహం జనంలో ఉంటుంది గనుక ఆ ఊపుతో మొత్తం 26 సీట్లూ గెలవాలని బీజేపీ ఆశిస్తోంది. కానీ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల సీట్లను బీజేపీ గెల్చుకున్నా, ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో గెలవడంలో విఫలమైంది. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినన్ని ఓట్లను లోక్‌సభ ఎన్నికల్లో జనం ఇవ్వలేదు. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగితే బీజేపీ సీట్లు 15కు మించవు. అదీగాక ఆదివాసీ ప్రాంతాల్లో బీజేపీ పరిస్థితి బలహీనంగా ఉందని వార్తలొస్తున్నాయి. అహ్మదాబాద్ వంటి స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ఎలాంటి ఫలితాలిస్తుందో తలియదు.

అస్సాంలోనూ తగ్గుదలే
అస్సాంలోని 14 సీట్లలో 2009లో కాంగ్రెస్ 7 గెలుచుకుంది. ఈసారి 12 దాకా సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. అంటే బీజేపీ బలం ఆ మేరకు తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదు.

 ఛత్తీస్‌గఢ్
 2009లో 10 లోక్‌సభ సీట్లతో అత్యుత ్తమ స్కోరు సాధించిన బీజేపీ, కిందటి డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో అధికారాన్నినిలబెట్టుకుంది. మావోయిస్టుల మెరుపుదాడిలో వీసీ శుక్లా, మహేంద్ర కర్మ వంటి సీనియర్ నేతలంతా మరణించినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించింది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కడే గెలిచిన పీసీసీ నేత చరణ్‌దాస్ మహంత్‌తోపాటు, మాజీ సీఎం అజిత్ జోగీ, కర్మ కొడుకు దీపక్ కర్మ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ బలం ఈసారి నాలుగైదు సీట్లకు పెరగవచ్చని భావిస్తున్నారు. అంటే బీజేపీకి ఈ రాష్ర్టంలో బలం తగ్గడమేగాని అదనంగా సీట్లొచ్చే అవకాశం లేనట్టే. ఆమ్‌ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం చేయడంతో అనూహ్య ఫలితాలు కూడా రావచ్చు.

 రాజస్థాన్... రాజసం కష్టమే
 ఆర్నెల్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈ రాష్ట్రంలో తన బలాన్ని ప్రస్తుతమున్న 4 నుంచి 21 లోక్‌సభ సీట్ల వరకూ పెంచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. 25 సీట్లున్న రాజస్థాన్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆప్ బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీలు జరిగాయి. ఆప్ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు సాధిస్తే బీజేపీ 15-18 సీట్లకే పరిమితమౌతుంది. అంటే అంచనాల కన్నా ఐదారు సీట్లు తగ్గవచ్చు. పైగా బీజేపీ అగ్రనేత జశ్వంత్‌సింగ్ తిరుగుబాటు, 10కి పైగా సీట్లలో కాంగ్రెస్ ఫిరాయింపుదారులకు టికెట్లివ్వడం వల్ల సీట్లు అంతకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు.

 ఢిల్లీ
 2009లో బీజేపీ ఇక్కడ ఒక్క సీటూ గెలవలేదు. ఇప్పుడు చతుర్ముఖ పోటీల్లో రెండు సీట్లు గెలిచినా గొప్పే. మొత్తం 7 సీట్లలో ఆప్ గట్టి పోటీ కారణంగా బీజేపీ ఇక్కడ సర్వేలు చెబుతున్నట్టు 6 సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్, ఆప్, బీజేపీల మధ్య సీట్లు చీలిపోయే అవకాశాలే ఎక్కువ. అంటే బీజేపీకి వచ్చే సీట్లను మూడు రెట్లు ఎక్కువ చేసి చూపిస్తున్నారు.

మరిన్ని వార్తలు