తారలొచ్చారు

25 Apr, 2014 02:52 IST|Sakshi
తారలొచ్చారు

 ఓటు వేయడానికి మనతారలు తరలి వచ్చారు. ప్రేక్షకులకు తమ నటనతో కాలక్షేపాన్ని ఇవ్వడమే కాక, సామాజిక బాధ్యతపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ఎన్నికల వేళ తాము ముందుంటామని నిరూపించారు. తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు గురువారం జరిగిన నేపథ్యంలో పలువురు ప్రముఖ నటీనటులు ఓటు హక్కును వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరిలో రజనీకాంత్, కమలహాసన్, శివకుమార్, సూర్య, విజయ్, అజిత్, కార్తీ, విశాల్, జీవా తదితరులు ఉన్నారు.
 ఓటు హక్కును వినియోగించుకోండి  రజనీకాంత్ పోయెస్‌గార్డెన్ సమీపంలోని స్టెల్లామేరి కళాశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటువేశారు. అనంతరం రజనీ విలేకరులతో మాట్లాడుతూ అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
 సుస్థిర ప్రభుత్వం
 మరో ప్రముఖ నటుడు కమలహాసన్, గౌతమి దంపతులు తేనాంపేటలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. నటుడు శరత్‌కుమార్ కొట్టివాక్కంలోని నెల్లై నాడార్ రోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. భార్య రాధికతో కలసి వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు విజయ్ అడయారు కామరాజర్ అవెన్యూలో  ఓటు వేశారు. నటుడు అజిత్ తిరువాన్మియూరులోని కార్పొరేషన్ పాఠశాలకు ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి పోలింగ్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండి ఓటు వేశారు. నటి ఖుష్బు, తన భర్తతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు జీవా టీ.నగర్‌లో హిందీ ప్రచార సభలోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు.
 

మరిన్ని వార్తలు