నగర పోరుకు సై

20 Mar, 2014 06:03 IST|Sakshi

 ఏలూరు, న్యూస్‌లైన్ :\  ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. 50 డివిజనల్లో 174 మంది అమీతుమీకి సిద్ధమయ్యారు. కొన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండగా మరికొన్ని డివిజన్లలో ముక్కోణపు పోరు నడుస్తోం ది. అధికార కాంగ్రెస్ పార్టీ 11 డివిజన్లకే పరిమితమైంది. అక్కడ కూడా అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్‌తోనే బరిలో ఉన్నట్టు సమాచారం.
 
 వైసీపీ వర్సెస్ టీడీపీ
 వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే ప్రధాన పోరు నెలకొంది. అయితే 12 డివిజన్లలో వీరిద్దరి మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. 3, 4, 5, 15, 30, 32, 36, 37, 42, 43, 45, 49 డివిజన్లలో ఈ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వానేవా అన్నట్టు ఉంది.
   
 ఇక్కడ ముక్కోణపు పోరు
 నగరంలోని 16 డివిజన్లలో ముక్కోణపు పోరు సాగుతోంది. 1, 8, 10, 11, 12, 14, 16, 18, 20, 25, 26, 33, 34, 38, 46, 47 తదితర 16 డివిజన్లలో ముగ్గురేసి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2, 6, 7, 9, 17, 22, 24, 27, 39, 41, 44, 48, 50 డివిజన్లలో నలుగురు అభ్యర్థులు తలపడుతున్నారు. 13, 21, 28, 29, 31, 35, 40 డివిజన్లలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 19 డివిజన్‌లో ఆరుగురు, 23 డివిజన్‌లో అత్యధికంగా 9 మంది గెలుపు కోసం తలపడుతున్నారు.
 
 11 డివిజన్లకే కాంగ్రెస్ పరిమితం
 నగర పోరులో కాంగ్రెస్ పార్టీ 11 డివిజన్లకే పరిమితమైంది. 2, 7, 13, 16, 24, 26, 28, 31, 39, 40, 41 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు కేవలం వారి వ్యక్తిగత ఇమేజ్‌తో మాత్రమే బరిలో ఉన్నారట. వీరిలో రెండు డివిజన్లలో తాజా మాజీ మహిళా కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు