మెరుపునిచ్చే మాయిశ్చరైజర్లు

15 Jun, 2018 02:17 IST|Sakshi

మాయిశ్చరైజర్లు, క్రీములను రెడీమేడ్‌గాకొనడం కంటే ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఇందుకు కావలసినవన్నీ సౌందర్య సాధనాల మార్కెట్‌లో దొరుకుతాయి.

నార్మల్‌ మాయిశ్చరైజర్‌
నార్మల్‌ స్కిన్‌ కోసం ఆల్మండ్‌ ఆయిల్‌ 30మి.లీ, రోజ్‌ డ్రాప్స్‌ 15, చామొమైల్‌ ఎసెన్స్‌ఐదు చుక్కలు, లావెండర్‌ ఐదు చుక్కలు, లెమన్‌ ఆయిల్‌ ఐదు చుక్కలు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి తడిలేని బాటిల్‌లోనిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ముఖానికి, చేతులకు పట్టించాలి.

రిచ్‌ మాయిశ్చరైజర్‌
పొడిచర్మానికయితే రిచ్‌ మాయిశ్చరైజర్‌ వాడాలి. ఇందుకు ఆప్రికాట్‌ ఆయిల్, అవొకాడో ఆయిల్, ఆల్మండ్‌ ఆయిల్, బీస్‌ వ్యాక్స్,రోజ్‌ వాటర్‌ ఒక్కొక్కటి మూడు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. రోజ్‌ వాటర్‌ మినహా మిగిలిన  అన్నింటినీ ఒక పాత్రలో వేసికలపాలి. ఈ పాత్రను వేడినీటి పాత్రలో పెట్టివ్యాక్స్‌ కరిగే వరకు ఉంచాలి. ఈ మిశ్రమాన్నిబాగా చిలికి చివరగా రోజ్‌ వాటర్‌ కలపాలి.చల్లారిన తర్వాత నిల్వ చేసుకుని వాడాలి.

హై ప్రొటీన్‌ మాయిశ్చరైజర్‌
ఒక కోడిగుడ్డును ఒక కప్పు పాలలో కలిపి చిలకాలి. దీనిని ముఖానికి పట్టించి ఆరిన తర్వాతచన్నీటితో కడగాలి. మిగిలిన మిశ్రమాన్నిఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వాడుకోవచ్చు.

మాయిశ్చరైజింగ్‌ లోషన్‌
బాగా పండిన పీచ్‌ను చెక్కు తీసి గుజ్జు తీసుకోవాలి. దీనిని గ్రైండ్‌ చేసి రసాన్ని వడపోయాలి.ఈ రసానికి అంతే మోతాదులో తాజా క్రీమ్‌నుకలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని వాడుకోవాలి.

మరిన్ని వార్తలు