నిగనిగలకు కాఫీ

7 Oct, 2018 00:11 IST|Sakshi

బ్యూటిప్స్‌

కాఫీ తాగడమే కాదు వెంట్రుకలకు పట్టిస్తే నిగనిగలాడతాయి. అర కప్పు కాఫీ గింజలతో చేసిన డికాషన్‌ తీసుకోవాలి. చల్లారిన డికాషన్‌ని దూది ఉండతో ముంచి, తల వెంట్రుకలు ఒక్కో పాయ తీసుకుంటూ మాడుకు పట్టేలా అద్దాలి. ఇలా పూర్తిగా డికాషన్‌ని పట్టించి, అరగంట వదిలేసి చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల వెంటుక కుదుళ్లకు బలం వస్తుంది. త్వరగా పెరుగుతాయి.షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కాఫీ డికాషన్‌ను వెంట్రుకలకు పట్టించాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి, తర్వాత కడిగేయాలి. ఇది వెంట్రుకలకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతంది. వెంట్రుకలు చిట్లడం, రాలడం కూడా తగ్గిపోతుంది.

పావు కప్పు కాఫీ గింజలను, హెయిర్‌ ఆయిల్‌ను కలిపి సన్నని మంట మరిగించాలి. ఓ 8 గంటలపాటు ఆ గింజలను నూనెలో అలాగే ఉంచాలి. తర్వాత వడకట్టుకోవాలి. ఈ నూనెను ఒక జార్‌లో పోసి భద్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు కాఫీ నూనెను జుట్టుకు, మాడుకు పట్టేలా రాసి, మర్దనా చేయాలి. దీనివల్ల వెంట్రుకలు రాలడం అనే సమస్య తగ్గుతుంది. పెరుగుదలా బాగుంటుంది. మీరు కండిషనర్‌లో టేబుల్‌ స్పూన్‌ కాఫీగింజల పొడిన కలిపి, తలస్నానం చేసిన తర్వాత రాసి 5–10 నిమిషాలు ఆరనిచ్చి, శుభ్రపరుచుకోండి. దీనివల్ల వెంట్రుకల నిగనిగలు పెరుగుతాయి.  

మరిన్ని వార్తలు