మొటిమలు, మచ్చలు పోవాలంటే...

12 Sep, 2015 00:12 IST|Sakshi
మొటిమలు, మచ్చలు పోవాలంటే...

బ్యూటిప్స్

ముఖంపై  మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకుంటే మొటిమలు, మచ్చలు లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో ఆరోగ్యకరమైన స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. అందుకు మూడు టీస్పూన్ల బేకింగ్ సోడాలో ఒక టీస్పూన్ ఓట్స్ వేసి కొన్ని నీళ్లతో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఈ మిశ్రమంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
చుండ్రు చూడటానికి చిన్న సమస్యగా ఉన్నా అది చేసే అనర్థాలు ఎన్నో. కాబట్టి యాంటీ డాండ్రఫ్ షాంపు మీకు ఏ విధంగాను పని చేయకపోతే ఈ చిట్కాను ట్రై చేయండి. తల స్నానం చేసే గంట ముందు మాడుకు పెరుగులో మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. తర్వాత కుంకుడు రసంతో తలను శుభ్రం చేసుకుంటే చుండ్రు మటుమాయం అవుతుంది.

మోకాళ్లు, మోచేతులు నల్లగా, గరుకుగా ఉండటం చూసేవాళ్లకు అసలు బాగుండదు. అందుకు నారింజ పండ్లను గుజ్జుగా చేసి అందులో కొబ్బరినూనె పోసి అరగంట పాటు నానబెట్టి దాన్ని రాసుకోవాలి. అది కడుక్కోకుండానే శనగపిండి, తేనె, పాలు కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే నలుపుదనం పోతుంది.
 
 

మరిన్ని వార్తలు