చెప్పుకోలేని సమస్యకు చెక్

29 Dec, 2013 23:09 IST|Sakshi

కొన్ని ఆరోగ్య సమస్యలు బయటికి చెప్పడానికి బిడియం అడ్డొస్తుంది. అలాంటివే ఫిస్టులా, పైల్స్, ఫిషర్స్. మొహమాటం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించరు. రక్తస్రావం ఎక్కువగా కావడంతో రక్తహీనత ఏర్పడుతుంది. కూర్చోవడం, నిలబడడంలో ఇబ్బందులుంటాయి. తాళలేనంతగా మంటలు. మలవిసర్జన తర్వాత పడే యాతన చెప్పనలవి కాదు. సర్జరీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. సమస్య మూలాలలను తెలుసుకొని చికిత్స ప్రారంభిస్తే సమస్యను శాశ్వతంగా పరిష్కరించ వచ్చు.
 
ఆనల్ ఫిస్టులా : ఏవైనా రెండు అవయవాల మధ్య ఏర్పడే సొరంగం వంటి రంధ్రాన్ని ఫిస్టులాగా చెప్పవచ్చు. ఇది సహజంగా ఉండేది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల ఏర్పడే ప్యాసేజ్. మలద్వారం, ఆనల్ గ్లాండ్స్ మధ్య ఏర్పడే మార్గాన్ని ఆనల్ ఫిస్టులా అంటారు.  
 
 లక్షణాలు:
ఫిస్టులా ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ దానివల్ల కలిగే బాధ భరించలేనిది. చీము, రక్తం వంటి స్రావాలు మలద్వారం నుంచి వస్తుంటాయి. కొన్నిసార్లు సమస్య ఉన్న వారు కూర్చున్న ప్రదేశంలో దుర్గంధం వస్తుంది.
 
 నిర్ధారణ: ఆనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, ఫిస్టులాగ్రామ్, ఏఫిస్టులా ప్రోబ్ టెస్ట్స్
 పైల్స్ లేదా మొలలు : మలద్వారానికి సంబంధించిన సమస్యల్లో పైల్స్ ముఖ్యమైనవి. మలద్వారం చుట్టూ ఉండే రక్తనాళాలలో వాపు రావడం వల్ల మొలలుగా ఏర్పడుతాయి.
 
 ఎక్స్‌టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అని పైల్స్‌లో రెండు రకాలు.
 లక్షణాలు:
 మొదట మలవిసర్జనకు వెళ్లినపుడు మాత్రమే నొప్పిగా ఉంటుంది
 
 చేతితో తాకి చూసినపుడు చిన్న గడ్డల్లాగా తాకుతాయి. దురదగా అనిపిస్తాయి. రాత్రిపూట దురదగా ఉంటాయి
 
 ఇంటర్నల్ పైల్స్ అయితే మాత్రం రక్తం ధారలా కారుతుంది. కొన్నిసార్లు మలంతో కలిసి రక్త స్రావం జరుగుతుంది
 
 కొంతమందిలో మలవిసర్జన అనంతరం రక్తం చుక్కలుగా పడుతుంది
 
 ఇంటర్నల్ పైల్స్‌ను గుర్తించడానికి మలద్వారం దగ్గర ఎటువంటి తేడా తెలియదు
 
 కొన్నిసార్లు గర్భవతులలో ఈ సమస్య వస్తుంది. ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. వీరికి తర్వాత కాలంలో ఈ సమస్య మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందిఊ
 
 నిర్ధారణ : ఆనల్ స్కోపీ, స్టిగ్నాయిడ్ స్కోపీ, కొన్ని సార్లు కొలనోస్కోపీ వంటి పరీక్షలు అవసరమవుతాయి. ఇంటర్నల్ పైల్స్‌కు చాలాసార్లు నొప్పి ఉండదు. వీటిని గ్రేడ్ 1-4 మధ్య గుర్తిస్తారు, కోలో రెక్టల్ క్యాన్సర్, రెక్టల్ ప్రొలాప్స్, పాలిప్స్ మధ్య తేడాను గుర్తించాలి. కాబట్టి సమస్యలన్నింటిని మామూలు పైల్సే కదా అని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
 
 ఆనల్ ఫిషర్స్ :
ఈ సమస్యలో మలద్వారం దగ్గరి చర్మం చిట్లిపోయి రక్తం పడుతుంది. చాలామంది పైల్స్‌కి, ఫిషర్స్‌కి తేడా గుర్తించరు. కొన్ని సార్లు 10-12 మిల్లీ మీటర్ల వరకు చర్మం చిట్లుతుంది.
 
 లక్షణాలు :మల విసర్జన మొదలయ్యే సమయంలో, ఆ తర్వాత మంట
 
 మల విసర్జనకు ముందుగా రక్త పడుతుంది. కొన్నిసార్లు మంట ఎక్కువ. ఇన్ఫెక్షన్ ఎక్కువైనపుడు ఇతర సమస్యలకు దారితీయవచ్చు
 
 చికిత్స తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఏర్పడిన అల్సర్లు శాశ్వతంగా ఉండిపోతాయి.
 
 జాగ్రత్తలు: ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవడం చాలా అవసరం. విసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. మాంసాహారం, ఆల్కహాల్, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. ఎక్కువ బరువు ఉన్నవారు బరువు తగ్గాలి. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోకూడదు. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అసహజ పద్ధతుల్లో శృంగారం చెయ్యకూడదు.
 
 హోమియో వైద్యం: ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా పైల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని హోమియోపతి మందుల ద్వారా అందించవచ్చు. హోమియో వైద్యం ద్వారా పైల్స్ వల్ల వాపువచ్చిన రక్తనాళాలను తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చు. అలా పైల్స్ సమస్యని పూర్తిగా, శాశ్వతంగా పరిష్కరించవచ్చు. ఫిస్టులా సమస్యలో ఫిస్టులా మార్గం మూసివేయడం మాత్రమే కాదు మళ్ళీ ఈ సమస్య రాకుండా కూడా హోమియో ద్వారా సమర్థమైన చికిత్స అందించవచ్చు.
 
 డాక్టర్ రవికిరణ్,
 ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి,
 అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్, విజయవాడ.
 ఫోన్: 7842 106 106 / 9032 106 106

 

మరిన్ని వార్తలు