త్వరలో సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌లు!

3 Jan, 2018 23:45 IST|Sakshi

  సెటైరమ్మా.. సెటైరూ..! 

ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)కి కొత్త సమస్య వచ్చి పడింది! కొత్తది సరే. పాతది ఏంటో? తాజ్‌మహల్‌ను చూడ్డానికి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగిపోతోందట! దాని వల్ల నష్టం ఏంటి? చేతులతో టచ్‌ చెయ్యడం వల్ల అరిగిపోతోందట. అరిగిపోయి, అసలు రూపం ‘డిమ్‌’ అయిపోతోందట! పౌర్ణమి నాడు కూడా తాజ్‌లో బ్రైట్‌నెస్‌ కనిపించడం లేదట. ఇక కొత్త సమస్య ఏంటి? సెల్ఫీలు! తాజ్‌ దగ్గరికి వచ్చేవాళ్లెవరూ తాజ్‌ మహల్‌ను చూడ్డానికి రావడం లేదనీ, తాజ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకోడానికి మాత్రమే వస్తున్నారని ఏఎస్‌ఐ వాపోతోంది.

సెల్ఫీలు తీసుకుంటే వాళ్లకేమిటి నష్టం? తాజ్‌ అరిగేం పోదు కదా! ‘పోదు నిజమే కానీ, సెల్ఫీలీ తీసుకున్నవాళ్లు ఊరికే ఉంటున్నారా? వాటిని ఎఫ్‌బీల్లో, ట్వీటర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. చేతయ్యీ చేతకాక తీసిన ఫొటోలలో తాజ్‌ మహల్‌ వంకర టింకరగా, ఒక ప్రపోర్షన్‌ లేకుండా పోవడంతో ఇంటర్నేషనల్‌గా తాజ్‌ మీద ఇంట్రెస్ట్‌ తగ్గిపోతోంది. తాజ్‌ ఇమేజ్‌కి డ్యామేజ్‌ జరుగుతోంది’’ అని ఏఎస్‌ఐ హెడ్డు ఫీలవుతున్నారు. ఏమిటి దీనికి సొల్యూషన్‌. ఏఎస్‌ఐ వాళ్లే కొంతమంది సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌లను పెట్టి వచ్చినవాళ్లందరికీ ఫొటోలు తీయించడమే. అప్పుడు ప్రతి ఫొటోలోనూ, తాజ్‌తో పాటు సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌ కూడా ఉంటాడేమో!

మరిన్ని వార్తలు