ఇతరుల సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం మీలో ఉందా?

4 Sep, 2017 00:10 IST|Sakshi
ఇతరుల సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం మీలో ఉందా?

సెల్ఫ్‌ చెక్‌

‘ఎవరు ఏమైతే నాకేంటి? నేను బాగుంటే చాలు... లేనిపోని విషయాల గురించి నాకెందుకు?... నేను ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం అందితేచాలు’... ఈ విధంగా తమ గురించే ఆలోచించుకొనేవారు తమకు లాభం చేకూర్చని విషయాల గురించి ఆలోచించటానికి ససేమిరా అంటారు. కొందరైతే ఎదురుగా జరుగుతున్న సమస్యలపై స్పందిస్తారు. సహాయం చేయటానికి ముందుంటారు. గొడవ పడుతున్నవారికి మధ్య పెద్దమనిషిలా జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తారు. మీలో ఆ సామర్థ్యం ఉందా?

1.    ఏదైనా శుభకార్యాలకు పెద్దగా మిమ్మల్ని పిలవటానికి చుట్టుపక్కల వారు ఉత్సాహాన్ని చూపుతారు.
    ఎ. అవును     బి. కాదు

2.    క్లిష్ట పరిస్థితుల్లో దిగాలు చెందరు.  
    ఎ. అవును     బి. కాదు

3.    అందరికీ ఇబ్బందికలిగించే సంఘటనలు మీముందు జరుగుతుంటే నిమ్మళంగా ఉండరు, ప్రశ్నిస్తారు.
    ఎ. అవును     బి. కాదు

4.    చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. మీ గురించి కామెంట్‌ చేసే అవకాశం ఇతరులకు ఇవ్వరు.
    ఎ. అవును     బి. కాదు

5.    వెంటనే స్పందించే తత్వం మీది. పనిలోనూ అలసత్వాన్ని ప్రదర్శించరు.
    ఎ. అవును     బి. కాదు

6.    వాక్‌చాతుర్యంతో ఎలాంటి విషయాన్నైనా సులభంగా డీల్‌ చేయగలరు.
    ఎ. అవును     బి. కాదు

7.    మధ్యవర్తిత్వం నడిపేటప్పుడు ఇద్దరి వాదనలూ వింటారు. ఏకపక్షంగా ప్రవర్తించరు.
    ఎ. అవును     బి. కాదు

8.    పదిమంది కూడినచోట గొడవ అవుతుంటే, మీ మాటల ద్వారా అక్కడ వాతావరణాన్ని చక్కదిద్దగలరు.
    ఎ. అవును     బి. కాదు

9.    మీ మాటల్లో పరిణతి, గాంభీర్యం ఉంటుంది. అర్థంలేని మాటలుండవు.
    ఎ. అవును     బి. కాదు

10.    ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు మీకు తోచిన సహాయం చేయకుండా ఉండరు.
    ఎ. అవును     బి. కాదు

‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో సహాయంచేసే లక్షణం బాగా ఉంటుంది. దీనివల్లే ఇతరుల విషయాలను పరిష్కరించటానికి చొరవ తీసుకుంటారు. ఇతరులకు సలహాలు ఇచ్చేముందు మీ ప్రవర్తన బాగుండేలా చూసుకుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే మీరు మీ గురించే ఆలోచిస్తారు. నాయకత్వ లక్షణాలు తక్కువ. 

మరిన్ని వార్తలు