అయ్యా...పిల్లల మీద అరవకండి!

29 Apr, 2014 23:36 IST|Sakshi
అయ్యా...పిల్లల మీద అరవకండి!

మానసికం

 బయట ఎన్ని పనులున్నా, వాటి తాలూకు ఒత్తిడి ఉన్నా, ఎన్ని సమస్యలున్నా...ఇంట్లోకి వచ్చాక మాత్రం ప్రశాంతంగా ఉండడం, కుటుంబంతో సంతోషంగా గడపడం అనేది ‘గృహస్థు లక్షణం’ అంటారు పెద్దలు. కాని కొందరు తండ్రులు మాత్రం బయటి ప్రపంచం ఒత్తిడి, కోపాన్నంతా ఇంట్లో ప్రదర్శిస్తుంటారు.

 ‘‘నాన్న...మా స్కూల్లో ఇవ్వాళి’’ అని పిల్లాడు తన క్లాసులో జరిగిన విషయాన్ని చెప్పబోతుంటే- ‘‘అబ్బ... రాగానే మెదడు తింటావు.... వెళ్లు’’ అంటూ కసురుకుంటారు కొందరు. పిల్లాడు నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ఇంతకుమించిన కారణం అక్కర్లేదు కదా! అయితే ఇదేమీ అషామాషీగా తీసుకోవల్సిన విషయం కాదు అంటున్నారు మానసిక విశ్లేషకులు. తరచుగా పిల్లల మీద అరవడం వల్ల, అది వారి ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అలాగే, క్రమశిక్షణ పేరుతో పిల్లలని శిక్షించడం వల్ల మార్పు రాక పోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి.

 ‘‘పిల్లల పెంపకంలో శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరచుగా అరవడం వల్ల...పిల్లల్లో నాన్న అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఈ ప్రభావం వల్ల పిల్లలు ఇతరులతో కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటున్నాడు డెన్మార్క్‌కు చెందిన సైకాలజిస్ట్ ఎరిక్ సిగార్డ్.

మరిన్ని వార్తలు