బ్యూటిప్స్‌

6 Mar, 2019 00:26 IST|Sakshi

►ఎండలో కమిలిన ముఖానికి...
►వేసవి ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ ఎండల్లో కాసేపలా బయటకి వెళ్లి రాగానే ముఖం నల్లబడిపోవడం లేదా కమిలిపోవడం... ఆ తర్వాత ముఖం చూసుకుని ఉష్షోమని నిట్టూర్చడం సహజం. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరిపాలలో దూది ముంచి, దానితో ముఖమంతా సున్నితంగా మర్దనా చేసుకుని ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే తిరిగి ముఖం ఎప్పటిలా కాంతులీనుతుంది. 

►బయటినుంచి వచ్చాక కొబ్బరినీళ్లతో ముఖం కడుక్కున్నా కొబ్బరినీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడుక్కున్నా ముఖం తాజాగా కళ కళలాడుతుంది.

మరిన్ని వార్తలు