హెల్త్‌టిప్స్‌

6 Jul, 2017 22:58 IST|Sakshi
హెల్త్‌టిప్స్‌

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్‌ తేనె, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణకోశాన్ని శుభ్రపరచడంతోపాటు శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతిమంతమవుతుంది. క్రమంతప్పకుండా నెల రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మకాంతి పెరగాలని కోరుకునే వాళ్లు జంక్‌ఫుడ్, రోస్టెడ్‌ ఫుడ్‌ను పూర్తిగా మర్చిపోవాలి.
     
ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, తాగడంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. శ్వాస తీసుకోవడంలో కూడా ఒక క్రమపద్ధతి పాటించాలంటారు నిపుణులు. దీర్ఘంగా అంటే లంగ్స్‌ నిండేలా శ్వాసించాలి.   ప్రతి భోజనంలోనూ తప్పని సరిగా పచ్చి కూరగాయల సలాడ్లు ఉండేలా చూడాలి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండడానికి దోహదం చేస్తాయి.

మరిన్ని వార్తలు